ఇండియా ( India ) లో కరోనా వైరస్ కేసులు ( Corona virus ) భారీగా పెరుగుతూ..28 లక్షల మార్క్ కూడా దాటేశాయి. అదే సమయంలో ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక చెబుతున్న విషయాలు మాత్రం ఊరట కల్గిస్తున్నాయి. ఇంతకీ ఆ నివేదిక ఏం చెబుతోంది. అది నిజమేనా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread ) నేపధ్యంలో ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక ( india outbreak report ) వెల్లడిస్తున్న విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం  కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో నైరాశ్యంలో ఉన్న ప్రజానీకానికి అది ఊరట కల్గించే అంశాలే. డిసెంబర్ నాటికి కోవిడ్ 19 వైరస్ భారత్ లో తగ్గిపోతుందనేది ప్రధానంగా ఐవోఆర్ నివేదిక ( IOR Report ) సారాంశం. Also read: Oxford vaccine: ఆగస్టు 22 నుంచి మూడో దశ ప్రయోగాలు ఇండియాలో


ఇండియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తూ సెప్టెంబర్ తొలివారంలో భారత్ లో కేసుల సంఖ్య పీక్స్ కు చేరుతుందని ఐవోఆర్ చెబుతోంది. అప్పటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ( Active cases in india ) కూడా భారీగా పెరిగి 7 లక్షల 80 వేలకు చేరనుందనేది ఆ నివేదిక అంచనా. క్రమంగా సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభమౌతుందని ఐవోఆర్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 3 ( By December 3rd ) నాటికి కోవిడ్ 19 ఇండియాలో తగ్గిపోతుందని వివేదిక స్పష్టం చేసింది.


నిన్నటి వరకూ హాట్ స్పాట్స్ గా ఉన్న ఢిల్లీ ( Delhi ), ముంబాయి ( Mumbai ) నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండటం ఐవోఆర్ నివేదిక ( IOR report ) కు ప్రాధాన్యత తెచ్చిపెడుతోంది. నగరాల వారీగా వైరస్ ఎప్పటికి తగ్గుతుందనేది కూడా ఐవోఆర్ అంచనా వేసింది. నవంబర్ నాటికి ముంబైలో, అక్టోబర్ చివరికి చెన్నైలో, నవంబర్ తొలివారానికి ఢిల్లీలో, నవంబర్ మూడోవారానికి బెంగుళూరులో కరోనా వైరస్ అనేది తగ్గిపోతుందని ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక చెబుతోంది. నవంబర్ రెండోవారం నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని తెలుస్తోంది.   Also read: Chennai Customs: కొరియర్ లో విదేశీ కరెన్సీ..చెన్నైలో పట్టివేత