Oxford vaccine: ఆగస్టు 22 నుంచి మూడో దశ ప్రయోగాలు ఇండియాలో

ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca vaccine ) మాత్రమే దేశంలో చేరే తొలి కరోనా వ్యాక్సిన్ గా అంచనాలున్నాయి.ఈ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ ఇండియాలో మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా ఈ విషయం ప్రకటించింది.

Last Updated : Aug 20, 2020, 01:27 PM IST
  • ఆగస్టు 22 నుంచి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు ఇండియా ప్రారంభం
  • దేశవ్యాప్తంగా 20 కేంద్రాల్లో 16 వందలమందిపై ప్రయోగం
  • తొలిరోజు వందమందికి వ్యాక్సిన్
Oxford vaccine: ఆగస్టు 22 నుంచి మూడో దశ ప్రయోగాలు ఇండియాలో

ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca vaccine ) మాత్రమే దేశంలో చేరే తొలి కరోనా వ్యాక్సిన్ గా అంచనాలున్నాయి.ఈ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ ఇండియాలో మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా ఈ విషయం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఇది శుభవార్తే. కరోనా వైరస్ ( Corona virus ) ను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ( Vaccine ) పైనే యావత్ ప్రపంచం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇటు ఇండియాకు చేరే తొలి కరోనా వ్యాక్సిన్ కూడా ఇదే కావచ్చని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ఈ వ్యాక్సిన్ తన కీలకమైన మూడో దశ ప్రయోగాల్ని( 3rd phase trials ) ఇండియాలో ప్రారంభిస్తోంది.  మరో రెండ్రోజుల్లో అంటే ఆగస్టు 22 నుంచి ఈ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దశలో 16 వందల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute of india ) సమాచారం అందించింది. 

పూణేకు ( Pune ) చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా..ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ను దేశవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభిస్తోంది. తొలిరోజు వందమందికి వ్యాక్సిన్ అందిస్తారు. ముఖ్యంగా  పూణే, మహారాష్ట్ర , అహ్మదాబాద్, ఢిల్లీ ఎయిమ్స్ , ముంబై సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్, కేఇఎం హాస్పిటల్, టీఎన్ మెడికల్ కాలేజ్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో 3వ దశ పరీక్షలను నిర్వహించనున్నారు.  Also read: Oxford Vaccine: మనకు అందే తొలి కరోనా వ్యాక్సిన్ అదే..

Trending News