ITBP jawans celebrated Diwali in Ladakh - Watch Video: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో - టిబెటిన్‌ ( ITBP ) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్ హిమ ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది. అయితే.. మైనస్ 20‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో దేశానికి రక్షణ కల్పిస్తున్న జవాన్లు ఆనందోత్సాహంతో దీపావళి పర్వదినాన్ని (Diwali celebrations) జరుపుకున్నారు. ఈ సందర్భంగా   విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్న జవాన్లంతా (ITBP jawans ) దీపాలను వెలిగించి ఆనందోత్సాహంతో నృత్యం చేశారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ కంపోజ్‌ చేసిన ‘అహో ఫిర్‌ ఫిర్‌ దియా జాలేనా’ అనే పాటను పాడుతూ.. ఐటీబీపీ జవాన్లంతా (Indo-Tibetan Border Police ) నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ హిమ వీరుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశానికి రక్షణ కల్పిస్తున్న జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శనివారం జైసల్మీర్‌లోని లోంగోవాలా పోస్ట్‌ సరిహద్దులో దీపావళిని జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు పలుప్రాంతాల్లో నిమగ్నమైన జవాన్లందరూ కూడా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. Also read: Modi Diwali with Army: ఆర్మీతో ప్రధాని దీపావళి దృశ్యాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe