న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు ( JEE main results 2020 ) విడుదలయ్యాయి. ఈ నెల 1 నుంచి 6 వరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు ( NTA JEE main result 2020 ) శుక్రవారం రాత్రి వెల్లడి కాగా...  ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో 100 పర్సంటైల్ స్కోర్ ( 100 percentile score ) సాధించి తమ సత్తా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 8.67 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 24 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. అందులో తెలంగాణ విద్యార్థులే ( Telangana students ) 8 మంది ఉండటం మరో విశేషం. ఆ 8 మంది విద్యార్థుల జాబితాలో వడ్డేపల్లి అరవింద్‌ కుమార్‌, చాగరి కౌశల్‌ కుమార్‌, చుక్క తనూజ్‌, శిక్ష కృష్ణ సగి, యశష్‌ చంద్ర, మోరెడ్డిగారి లిఖిత్‌రెడ్డి, రాచపల్లె శశాంక్‌ అనిరుధ్‌, రొంగల అరుణ్‌ సిద్ధార్థ ఉన్నారు. Also read : New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ తర్వాత ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా, నలుగురు విద్యార్థులతో రాజస్థాన్‌ మూడో స్థానంలో, ముగ్గురు విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో నిలిచాయి. Also read : TS ECET counselling schedule: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదిగో


JEE Main 2020 topper Akhil Jain అతడే జేఈఈ మెయిన్ టాపర్:
రాజస్థాన్‌కి చెందిన అఖిల్ జైన్ జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. అఖిల్ జైన్ తండ్రి ఓ వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావాలని భావించిన అఖిల్ జైన్‌కి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ప్రాణం. ముఖ్యంగా మ్యాథమేటిక్స్‌లో ఉండే సవాళ్లను ఎదుర్కోవడంలో మజాను ఆస్వాదించే తనకి ఐఐటిని ( IIT Aspirants ) లక్ష్యంగా పెట్టుకోవాల్సిందిగా ఇతరులు చేసిన సూచనలే బాగా పనిచేశాయని అఖిల్ జైన్‌ వెల్లడించాడు. Also read : 
Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR