New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి ( Telangana new revenue act 2020 bill ) శాసనసభ ఆమోదం తెలిపింది. సభలో మూజువాణి ఓటింగ్‌ ద్వారా బిల్లుకు సభ్యుల నుంచి ఆమోదం లభించింది. 

Last Updated : Sep 12, 2020, 03:05 AM IST
New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే

హైదరాబాద్‌ : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి ( Telangana new revenue act 2020 bill ) శాసనసభ ఆమోదం తెలిపింది. సభలో మూజువాణి ఓటింగ్‌ ద్వారా బిల్లుకు సభ్యుల నుంచి ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండానే సభ్యుల నుంచి ఆమోదం లభించినట్లు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణలో ఇకపై వీఆర్వో వ్యవస్థ రద్దు ( VRO system cancelled ) కానుండటంతో పాటు ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ( Agricultural lands regestration ), మ్యుటేషన్‌ ( Mutations ) ప్రక్రియ కూడా జరుగనుంది. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో రేవంత్ రెడ్డి హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై తహశీల్దారులే ( Tahsildars ) వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌ ( Dharani portal ) ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. Also read : VRA In Telangana: వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ బంపరాఫర్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) మాట్లాడుతూ.. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టం అవుతుందని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు ప్రజలకు ఇబ్బందిగా ఉన్న అంశాలను తొలగిస్తూ ఇకపై భూముల రికార్డుల నిర్వహణను మరింత సులభతరం చేసేలా ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించినట్టు తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం అనేది ఇంతటితో కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని సీఎం కేసీఆర్ తెలిపారు. Also read : TS ECET counselling schedule: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదిగో

Trending News