న్యూఢిల్లీ: బీజేపీ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia) కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో కరోనా టెస్టులు చేయించుకున్నారు. సింధియాకు కోవిడ్19 (COVID-19) పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు తల్లి మాధవి రాజే సింధియాకు సైతం కోరా పాజిటివ్‌గా నిర్ధారించారు. జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా లక్షణాలు (Jyotiraditya Scindia CoronaVirus Positive) కనిపించగా, ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కోవిడ్19 లక్షణాలు లేవని తెలుస్తోంది.  కోటి రూపాయల ప్రైజ్‌మనీ విజేత ఆ డ్యాన్సర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ఈ ఏడాది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తన బలాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో తాజాగా సింధియాకు కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు టెస్టులకు వెళ్లారు. కోవిడ్19 టెస్టుల్లో సింధియాతో పాటు ఆయన తల్లికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. కరోనా మృత్యుహేల.. దేశంలో పిట్టల్లా రాలిపోతున్న జనాలు


ఇటీవల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ అయిన సంబిత్ పాత్ర ఇటీవల కరోనా లక్షణలతో గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేరారు. సోమవారం రోజు డిశ్ఛార్జ్ అయ్యారు. నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల రిపోర్ట్ రావాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్


Jyotiraditya Scindia Tested COVID19 Positive