కోటి రూపాయల ప్రైజ్‌మనీ విజేత ఆ TikTok డ్యాన్సర్

టిక్‌టాక్‌లో సరదా డ్యాన్స్ వీడియోలు షేర్ చేసుకునే ఓ యువకుడు నేడు జాక్‌పాట్ కొట్టాడు. ఎంటర్‌టైన్మెంట్ నెంబర్ వన్ డ్యాన్సర్‌గా నిలచి కోటి రూపాయల ప్రైజ్ మనీ సాధించాడు.

Last Updated : Jun 9, 2020, 04:22 PM IST
కోటి రూపాయల ప్రైజ్‌మనీ విజేత ఆ TikTok డ్యాన్సర్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను తన డ్యాన్స్ ద్వారా మెప్పించిన టిక్ టాక్ (TikTok) డ్యాన్సర్ తాను అనుకున్నది సాధించాడు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నిర్వహిస్తున్న తొలి హోమ్ రియాలిటీ షో ఎంటర్‌టైన్మెంట్ నెంబర్ 1 విజేత ఎవరో వెల్లడించారు. టిక్ టాక్ యూజర్ బాబా జాక్సన్ (TikTok User Baba Jackson) విజేతగా నిలిచినట్లు హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. ప్రైజ్ మనీ రూ.1కోటి అందజేయనున్నట్లు తెలిపాడు. మహానటిపై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos

టిక్ టాక్ ప్రొఫైల్ బాబా జాక్సన్ (Baba Jackson)‌గా పేరు పెట్టుకున్న ఆ డ్యాన్సర్ పేరు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). కాగా అతడి డ్యాన్స్ అంటే నెటిజన్లకు చాలా ఇష్టం. కొన్ని రోజుల కిందట అతడు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో హృతిక్ రోషన్‌ సైతం బాబా జాక్సన్ వేసే స్టెప్పులు చూసి ఆశ్చర్యపోయాడు. అతడికి సహకారం అందించాలని కోరాడు.  పోర్న్‌స్టార్‌గా మారిన నెంబర్ వన్ రేసర్

సోషల్ మీడియాలో అతడి వీడియోలకు విశేష స్పందన లభించింది. తన కఠోరశ్రమతో డ్యాన్సర్ యువరాజ్ సింగ్ అనుకున్నది సాధించాడు.  వరుణ్ ధావన్, ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా నిర్వహించిన హోం రియాలిటీ షో బెస్ట్ డ్యాన్సర్‌గా నిరూపించుకుని ఎంటర్‌టైన్మెట్ నెంబర్ వన్‌గా నిలిచాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News