Kamal Haasan: కేంద్ర ప్రభుత్వ నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనంపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవనానికి పునాదిరాయి వేసిన నేపధ్యంలో మక్కల్ నిధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


డిసెంబర్‌ 10న ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం ( New Parliament Building )సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ( Central Vista Project )కు ప్రధాని నరేంద్ర మోదీ ( pm narendra modi ) శంకుస్థాపన చేశారు. టాటా సంస్థ ( Tata Constructions ) నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం ఖర్చు 971 కోట్లు. 64 వేల 5 వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


నటుడు ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ( Kamal Haasan ) దీనిపై మండిపడ్డారు. దేశ జనాభాలో సగం మంది తిండీతిప్పలు లేకుండా అల్లాడుతుంటే కొత్త పార్లమెంట్ భవనం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అంత ఖర్చు పెట్టి కొత్త భవనం ఎందుకు కడుతున్నారని మండిపడ్డారు. చైనా గ్రేట్ వాల్ ( China Great wall ) నిర్మాణ సమయంలో చాలామంది మరణించారని..అయినా ప్రజల ప్రాణాల్ని కాపాడటానికంటూ పాలకులు సర్ది చెప్పారని గుర్తు చేశారు. ఎవరిని కాపాడేందుకు వేయి కోట్లతో పార్లమెంట్ భవనం నిర్మిస్తున్నారో ప్రధాని చెప్పాలంటూ కమల్ హాసన్ ప్రశ్నించారు. ఇప్పటికే కరోనా వైరస్ ( Corona virus ) కాటుతో ఆర్ధిక రంగం కుదేలైన పరిస్థితుల్లో ఇంతటి భారీ వ్యయమెందుకన్నారు.  


తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ( Assembly Elections ) కమల్ హాసన్ తన పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు అంశాలపై ఘాటుగా స్పందిస్తున్న కమల్ హాసన్..పార్లమెంట్ నూతన భవనం వ్యవహారంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. Also read: Covid19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ మార్గదర్శకాలు వ్యాక్సిన్ ఎలా ఇస్తారు..ఎంత మందికి ఇస్తారో తెలుసా..