Covid19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ మార్గదర్శకాలు వ్యాక్సిన్ ఎలా ఇస్తారు..ఎంత మందికి ఇస్తారో తెలుసా..

కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లో ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఓ వైపు వ్యాక్సిన్ పంపిణీకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం పలు మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

Last Updated : Dec 13, 2020, 07:09 PM IST
  • కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
  • తొలి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్, వెబ్‌సైట్ ఏర్పాటు
  • రోజుకు లేదా సెషన్ కు వందమందికి వ్యాక్సినేషన్
Covid19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ మార్గదర్శకాలు వ్యాక్సిన్ ఎలా ఇస్తారు..ఎంత మందికి ఇస్తారో తెలుసా..

కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లో ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఓ వైపు వ్యాక్సిన్ పంపిణీకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం పలు మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 vaccine ) పంపిణీకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ ( Vaccine ) అందుబాటులో రానున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ప్రత్యేకంగా  మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తొలి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలి విడత వ్యాక్సిన్ అందుకునేవారిలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఆర్మీ వంటి అత్యవసర సేవలు అందించే విభాగపు ఉద్యోగులు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు. 50 ఏళ్ల కంటే తక్కువుండి..దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా తొలి విడతలో ఉంటారు. Also read: Republic TV CEO Arrested: రిపబ్లిక్‌ టీవీ సీఈఓను అరెస్ట్ చేసిన పోలీసులు

వ్యాక్సిన్ ఎలా ఇస్తారు

రోజుకు లేదా సెషన్‌కు వందమందికి వ్యాక్సిన్ ఇస్తారు. తొలి విడత పూర్తయిన తరువాత రెండో విడతలో మిగిలినవారికి ఇస్తారు. 50 ఏళ్లు పైబడిన వారికి రెండు గ్రూపులుగా విభజిస్తారు. 50-60, 60 కంటే పైన ఉన్నవాళ్లుగా విభజించి..వ్యాక్సిన్ అందిస్తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ( Central Election commission ) తాజాగా ప్ర‌క‌టించిన ఓట‌రు జాబితా ప్రకారం వయోవృద్ధుల ఎంపిక జరుగుతుంది. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు నిర్ధారిత సెషన్ కేంద్రాల్లోనూ..హైరిస్క్ వారికి సెషన్ సైట్స్ లేదా మొబైల్ సైట్స్‌లో వ్యాక్సిన్ అందిస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ ఇచ్చేది స్పష్టంగా చెప్పాలి. 

వ్యాక్సిన్ తీసుకునేముందు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇందులోవారికి స్లాట్ల ఆధారంగా వ్యాక్సిన్ ఇస్తారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. వ్యాక్సిన్ పంపిణీకు సిబ్బందికి శిక్షణ ఉంటుంది. వ్యాక్సిన్ బృందంలో 5మంది ఉంటారు. ఒక డాక్టర్ , స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, సహాయక నర్శు, లేడీ హెల్త్ విజిటర్ ఉంటారు. పోలీసు, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్ నుంచి ఒక వ్యాక్సినేషన్ ఆఫీసర్ ఉంటారు. 

ఎంట్రీ పాయింట్ వద్ద చెకింగ్ అనంతరం లోపల మరో వ్యాక్సినేషన్ ఆఫీసర్ వివరాలు సరి చూసుకుంటారు. ఆ తరువాత వ్యాక్సిన్ వేసి..దానిపై అవగాహన కల్పిస్తారు. వ్యాక్సిన్ కోసం ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు..ఎంతమందికి ఇచ్చారనే వివరాల్ని రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు.. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సిస్టమ్‌ ( Covid 19 vaccine intelligence network system )ను ప్రత్యేకంగా అందుబాటులో తీసుకొస్తారు. యాడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ సర్వైలెన్స్ వ్యవస్థ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని పర్యవేక్షిస్తారు. Also read: JP Nadda tests positive for Coronavirus: జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్

Trending News