Tamil nadu:తమిళనాట ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు అధికార విపక్ష పార్టీలు..మరోవైపు కమల్ హాసన్. ఇంకోవైపు రజనీకాంత్. ఎవరు ఎవరితో జత కడతారో ఇంకా తెలియకపోయినా..కమల్ హాసన్ చేసి వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ( Tamil nadu assembly elections ) జరగనున్నాయి. ఓ వైపు అధికార పార్టీ ఏఐఏడీఎంకే..మరోవైపు డీఎంకే. ఇంకోవైపు అధికారపార్టీతో సన్నిహితంగా ఉన్న జాతీయ పార్టీ బీజేపీ ( Bjp ). ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్టీ ( Kamal Haasan party ) ఇప్పటికే ప్రచారం ప్రారంభించేసింది. ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ అంతా తానై కలియ తిరుగుతున్నారు. ఇంకోవైపు జనవరిలో పార్టీ స్థాపించనున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఎన్నికలు వచ్చే ఏడాది ఉన్నా..ఇప్పటికే తమిళనాడులో ఎన్నికల వేడి మాత్రం ప్రారంభమైపోయింది.


ఈ నేపధ్యంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆసక్తి కల్గిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ( Superstar rajinikanth ) కోరితే..ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు తాను సిద్ధమేనని కమల్ హాసన్ ( Kamal Haasan ) చెప్పడం కీలకంగా మారింది.  రాజకీయ పార్టీ స్థాపించినా సరే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండనని రజనీకాంత్ చెప్పిన నేపధ్యంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ, కమల్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే సందేహం కలుగుతోంది. రజనీ కాంత్ ఆశీస్సులతో మద్దతుతో కమల్ హాసన్ పార్టీ అధికారం లక్ష్యంగా పావులు కదుపుతుందా అనే వార్తలు విన్పిస్తున్నాయి. 


ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురం ( Kanchipuram ) జిల్లాలో కమల్ హాసన్ పర్యటించారు. అధికారపార్టీపై ఆరోపణలు చేశారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వం..ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. డబ్బుల కంటే తాను ప్రజల్నే విశ్వసిస్తానన్నారు. మరోవైపు తూత్తుకుడి ఆందోళనలపై నటుడు రజనీకాంత్ కు సమన్లు జారీ అయ్యాయి. తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ 2018లో జరిగి ఉద్యమం హింసాత్మకంగా మారి 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


Also read: One Nation One Election: జమిలి ఎన్నికలకు మేం సిద్ధమే: సీఈసీ