Reason behind Kangana Ranaut's Y-plus security: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగడుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి కేంద్రం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ముంబై మరో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా మారిపోయిందని.. మూవీ మాఫియా కంటే ముంబై సిటీ పోలీసులను చూసే ఎక్కువగా భయపడాల్సి వస్తోందని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను శివసేన ( Shiv Sena ) తీవ్రంగా ఖండించడం.. కంగనా ఇక ముంబైకి తిరిగిరావొద్దంటూ పలువురు శివసేన నేతలు ఆమెను హెచ్చరించడం వంటి పరిణామాలన్ని పతాక శీర్షికలకెక్కిన సంగతి కూడా తెలిసిందే. ఐతే కంగనాకు వై-ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించిన విషయంలో కేంద్రంపైనా శివసేన పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Union Minister of State for Home G Kishan Reddy ) ఈ వివాదంపై స్పందించారు. Also read : Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కూతురు కంగనా రనౌత్‌‌ను కొంతమంది బెదిరింపులకు గురిచేస్తున్నారని.. అటువంటి వారి నుంచి తన కూతురికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ కంగన తండ్రి ( Kangana Ranaut's father ) హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కంగనా రనౌత్ తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ థాకూర్‌ని కలిసి ఓ వినతి పత్రం అందించగా.. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ థాకూర్ ( Himachal Pradesh CM Jai Ram Thakur ) కంగన తండ్రి విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా కేంద్ర హోంశాఖను కోరారని .. ఆ తర్వాతే ఆమెకు వై ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించడం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. Also read : Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు


Y-plus category security: వై ప్లస్ కేటగిరి సెక్యురిటీలో భాగంగా 24 గంటల పాటు 10 మంది సాయుధులైన కమాండోలు కంగనా రనౌత్‌‌కి భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే ఇటీవల కంగనా రనౌత్ ముంబైకి చేరుకున్న క్రమంలో ఆమె చుట్టూ వై ప్లస్ సెక్యురిటీ సిబ్బంది ఒక వలయంగా ఏర్పడి రక్షణ కల్పించిన ఫోటోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also read : Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు: సంజయ్ రౌత్


ఇదిలావుంటే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ( Rhea Chakraborty ) ఇటీవలే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం రియా చక్రవర్తి దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం రియా 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉంది. Also read : Kangana Ranaut: ఎయిర్ పోర్ట్ లో కంగనా సెక్యూరిటీని చూశారా?


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR