Swathi Sathish: కొందరు అందంపై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు సినీ ప్రపంచంలో చోటుచేసుకుంటున్నాయి. అందం కోసం సర్జరీలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ అర్తి అగర్వాల్ బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకుంది. చివరకు అది వికటించి మృతి చెందింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన వరుసగా జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా మరో నటికి సర్జరీ వికటించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నడ హీరోయిన్ స్వాతి సతీష్‌ పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమె తన అందాన్ని మెరుగు పర్చుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈక్రమంలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో రూట్ కెనాల్ థెరపీ చేయించుకుంది. థెరపీ వికటించడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారింది. ఆమె ముఖం అంతా వాపు వచ్చింది. 


[[{"fid":"235159","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


వైద్యులు మాత్రం రెండు మూడు రోజుల్లో తగ్గుతుందని అంటున్నారు. కానీ తనకు మూడు వారాలు ఇలాగే ఉందని బాధితురాలు చెబుతోంది. ముఖం వాపు తగ్గగపోగా తీవ్రమైన నొప్పి వస్తోందని వాపోతోంది. ఎవరు గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. స్వాతి సతీష్‌ సర్జరీలో అనస్థిషియాకు బదులు సాలిసిలిక్‌ యాసిడ్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆమె మరో ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం తెలిసిందని ప్రచారం జరుగుతోంది. 


Also read:Supreme Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సుప్రీం కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!


Also read:Himachal pradesh: గాలిలోనే నిలిచిపోయిన కేబుల్ కారు..పర్యాటకులను రక్షించిన రెస్క్యూ టీం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook