Karnataka Exit polls vs Results: విఫలమైన ఎగ్జిట్ పోల్ అంచనాలు, నిజమైన జీ న్యూస్, ఆత్మసాక్షి ఎగ్టిట్ పోల్ ఫలితాలు
Karnataka Exit polls vs Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని దాటి మరీ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సొంత ఎజెండా మోస్తూ సర్వేలు చేసిన సంస్థలు అభాసుపాలయ్యాయి. విస్పష్టమైన మెజార్టీ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
Karnataka Exit polls vs Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకు షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అటు బీజేపీ 64కు పరిమితమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. దాదాపు 10 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారంటే ఆ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ మోదీ మేజిక్ పనిచేయలేదు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీకు అధికారం అప్పగిస్తూ విస్పష్టమైన తీర్పు ఇచ్చారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 113. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి 136 స్థానాలవైపుకు దూసుకెళ్తోంది. ఏకంగా 124 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ దూసుకెళ్తోంది. బీజేపీ మాత్రం 63-64 వద్దే అపసోపాలు పడుతోంది. ఇక గత ఎన్నికల్లో కింగ్‌గా నిలిచిన జేడీఎస్ 20 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇతరులు మాత్రం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఏ ఎగ్టిట్ పోల్స్ నిజం..ఏవి సత్య దూరం
పోలింగ్ రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మెజార్టీ కాంగ్రెస్‌కు పట్టం కట్టినా స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని చెప్పలేకపోయాయి. మేజిక్ ఫిగర్‌కు అటు అటూ నిలుస్తుందని, హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని విశ్లేషించాయి. కేవలం 4 సంస్థలే కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటుతుందని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 107-119 స్థానాలు, బీజేపీ 78-90 స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేసింది. జీ న్యూస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ 103-118 స్థానాలు, బీజేపీ 79-94 స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేసింది. సీ వోటర్ సంస్థ కాంగ్రెస్ పార్చీ 100-112 స్థానాలు, బీజేపీ 83-95 స్థానాలు సాధిస్తుందని తెలిపింది.
ఆత్మసాక్షి అంచనా నిజం
అన్ని సర్వేలు అటూ ఇటూ ఉన్నా ఆత్మసాక్షి సర్వే మాత్రం కచ్చితంగా నిజమైందని చెప్పవచ్చు. ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీకు 117-124 స్థానాలు వస్తాయని, బీజేపీ 83-94 స్థానాలు దక్కించుకుంటుందని, జేడీఎస్ 23-30 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. ఇప్పుడు వెల్లడౌతున్న ఫలితాలు ఆత్మసాక్షి సర్వే ఫలితాలకు చేరువలో ఉన్నాయి. మరే ఇతర సంస్థ ఇంత కచ్చితంగా అంచనా వేయలేకపోయింది
ఘోరంగా విఫలమైన న్యూస్ నేషన్, సువర్ణ న్యూస్ సర్వేలు
ఇక మరోవైపు పార్టీ ఎజెండా మోస్తూనే సర్వేలు చేపట్టిన సంస్థలున్నాయి. ఇవి ఈసారి బొక్కబొర్లా పడ్డాయి. ఇందులో ముఖ్యమైంది సువర్ణ న్యూస్. ఈ సంస్థ అంచనా ప్రకారం బీజేపీ 94-117 స్థానాల్ని, కాంగ్రెస్ పార్టీ 91-106 స్థానాలు, జేడీఎస్ 14-24 స్థానాల్ని గెల్చుకుంటాయి. రాష్ట్రంలోని ప్రాంతీయ ఛానెల్ ఇది. అక్కడి నాడిని పసిగట్టడంలో విఫలమైంది. ఇక జాతీయ ఛానెల్ న్యూస్ నేషన్ సీజీఎస్ సర్వే కూడా సత్యదూరంగా నిలిచింది. ఈ సంస్థ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 86 సీట్లకు పరిమితమైతే బీజేపీ 114 సీట్లు, జేడీఎస్ 21 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది.
నిజమైన జీ న్యూస్ అంచనా
కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి మెజార్టీ సాధిస్తుందని చెప్పిన సర్వేలు మూడే మూడున్నాయి. జీ న్యూస్ 118 సీట్ల వరకూ అంచనా వేయగా, ఆత్మసాక్షి 124 స్థానాలకు, పీపుల్స్ పల్స్ 119 స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేశాయి. ఇప్పుడీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. మిగిలిన సంస్థలు ఘోరంగా విఫలమై అభాసుపాలయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook