Karnataka Assembly Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాలు వెలువడే కొద్దీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పెంచుకుంటోంది. అటు బీజేపీ మాత్రం 70 దాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కన్పిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి కాంగ్రెస్ మెజార్టీ సాధించడం విశేషం. అటు జేడీఎస్ 23 సీట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 113. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 130 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది. మరో 6-7 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.
ఓ వైపు ఫలితాలు వెలువడుతుంటే మరోవైపు క్యాంప్ రాజకీయాలు ప్రారంభమైపోయాయి. గెలిచిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమై శిబిరాలకు తరలించేందుకు సన్నాహాలు పూర్తి చేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లేదా తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను తరలించే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్ హోటల్లో 20, నోవాటెల్ హటల్‌లో 20 గదులు బుక్కయ్యాయి.
అదే సమయంలో ఎమ్మెల్యేల్ని ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికోసం 12 హెలీకాప్టర్లు సిద్ధం చేసినట్టు సమాచారం. 12 హెలీకాప్టర్ల ద్వారా ఎమ్మెల్యేల్ని శిబిరాలకు తరలించనుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సాయంత్రానికి ఎమ్మెల్నేల్ని ఎయిర్‌లిఫ్ట్ చేయవచ్చని సమాచారం.
Also read: Unclaimed Amount: జూన్ నుంచి 3 నెలల్లోగా 35 వేల కోట్లను పంచేయనున్న కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook