Karnataka: కర్ణాటకలో ఏం జరుగుతోంది..మళ్లీ నాయకత్వ మార్పు ఉంటుందా..బీజేపీ ఫైర్‌బ్రాండ్ చేసిన వ్యాఖ్యల వెనుక అర్దమేంటి, 2 వేల 5 వందల కోట్లు ఎవరడిగారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక అధికార బీజేపీలో ముసలం రేగుతోంది. అంతర్గతపోరు కొనుసాగుతోంది. యడ్యూరప్పను మార్చేవరకూ సాగిన ముసలం ఇప్పుడు బసవరాజ్ బొమ్మైను మార్చాలంటోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరు పర్యటనలో నాయకత్వ మార్పు ఉండదని బీజేపీ నేతలు కొట్టిపారేసినా..పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ బసనగౌడ పాటిల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.


కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో తానుంటానని ఇటీవల బసనగౌడ పాటిల్ స్పష్టం చేశారు. అంతేకాకుండా..ముఖ్యమంత్రి పదవి కోసం 2 వేల 5 వందల కోట్లు ఇవ్వాలని అడిగినట్టు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చినవారిలో కొందరు..వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేశామని చెప్పుకుని..ముఖ్యమంత్రిని చేస్తామని 25 వందల కోట్ల సిద్ధం చేసుకోవాలని అడిగారన్నారు. 2 వేల 5 వందల కోట్లంటే ఎంత మొత్తమో తెలుసా అని ప్రశ్నించినట్టు బసనగౌడ పాటిల్ చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజకీయాల్లో రాణించాలంటే ముక్కూమొహం తెలియనివారి వెంట పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. 


ఆ 2 వే 5 వందల కోట్లు ఎవరడిగారనేది మాత్రం పాటిల్ వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో కర్ణాటకలో హిజాబ్, హలాల్ , అజాన్ వంటి వరుస వివాదాలతో బసనరాజ్ బొమ్మై ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని తెలుస్తోంది. వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో ఇదే నాయకత్వంతో వెళ్తుందా లేదా అనేది సందేహమే. ఇప్పుడు తాజాగా పాటిల్ వ్యాఖ్యలతో నాయకత్వమార్పుపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. 


Also read: India Covid: దేశంలో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు, ఇకపై అప్రమత్తత అవసరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.