New coronavirus: కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండటంతో  భారతదేశం అప్రమత్తమైంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు కర్నాటక సైతం కర్ఫ్యూ విధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బ్రిటన్ ( Britain )‌లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ ( New coronavirus ) విజృంభిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 20 అనుమానిత కేసులు నమోదయ్యాయి. అటు ముందు జాగ్రత్త చర్యగా యూకే నుంచి విమాన రాకపోకల్ని ( Uk flights banned ) ఇండియా నిషేధించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల్నించి వచ్చేవారికి విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ( RTPCR Test ) నిర్వహించి..పాజిటివ్ తేలితే కోవిడ్ సెంటర్లకు..నెగెటివ్ అయితే 14 రోజుల తప్పనిసరి క్వారెంటైన్ చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ దిశగా ఆలోచన చేస్తోంది. 


మరోవైపు గుజరాత్ ( Gujarat ), మహారాష్ట్ర ( Maharashtra ) రాష్ట్రాలు రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కర్నాటక ( Karnataka ) కూడా అదే బాట పట్టింది. కరోనా కొత్త రకం వైరస్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ( Night curfew ) విధిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 23వ తేదీ అంటే ఇవాళ రాత్రి పది గంటల్నించి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతుంది. జనవరి 2వ తేదీ వరకూ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


అటు బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. అందుకే డిసెంబర్ 31 వేడుకలపై ఆంక్షలు విధించింది. 


Also read: West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా