తమిళ చిన్నమ్మ శశికళ ఆశలు అడియాశలయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నిర్ణీత గడువు కంటే ముందే  విడుదలవ్వాలనుకున్న ఆమె ఆశలకు కర్నాటక హోంమంత్రి చెక్ పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆదాాాయానికి మించి ఆస్థుల  కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష, పది కోట్ల జరిమానాకు గురైన తమిళ చిన్నమ్మ శశికళ ( Sasikala ) 2021 ఫిబ్రవరికి విడుదల కావల్సి ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిమానాను చెల్లించిన పక్షంలో జనవరిలోనే విడులయ్యే అవకాశాలున్నాయని జైళ్ల శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పదికోట్ల జరిమానాను ఇటీవలే కోర్టుకు చెల్లించారు. అయితే కర్నాటక హోంమంత్రి బసవరాజ్ ( Karnataka home minister Basavaraj ) మీడియాతో మాట్లాడిన విషయాలిప్పుడు సంచలనమౌతున్నాయి. శశికళ ఆశలపై నీళ్లు చిమ్మేసినట్టేనని తెలుస్తోంది.


అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇలాంటి నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని..ముందస్తు విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్షాకాలముంటుందని..రాజకీయ ప్రమేయానికి చోటు లేదన్నారు. 


శశికళ ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో..ఆమె తరపు న్యాయవాదులు బెంగళూరు కోర్టులో పిటీషన్ వేసేందుకు సిద్ధమౌతున్నారు. జరిమానా కూడా ఇప్పటికే చెల్లించేసినందున వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. 


తమిళనాట  ( Tamilnadu Assembly Elections )వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో సాధ్యమైనంత త్వరగా విడుదలై బయటకు వస్తే..ఎన్నికలపై దృష్టి పెట్టవచ్చనేది శశికళ ఆలోచన. మరోవైపు శశికళ బయటకు వస్తే తమకెదురయ్యే ఇబ్బందుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమౌతున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ( Palanisami ), మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు. Also read: CBSE Board Exams 2021: త్వరలో సీబీఎస్సీ డాటా షీట్, అత్యధిక మార్కుల కోసం చిట్కాలు