Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూమకూర్ జిల్లా పావగద వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా కొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం పావగద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు. బస్సు హోసకోట నుంచి పావగదకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన షాన్‌వాజ్ (20) అనే యువకుడు ఉన్నట్లు గుర్తించారు. 


ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. అందులో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నట్లు పేర్కొన్నారు. ఓవర్‌ లోడ్ వల్లే ప్రమాదం జరిగినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటను సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


ఇదే కర్ణాటకలో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు జగలూరు గ్రామ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. 



Also Read: PAN-Aadhaar: గడువు సమీపిస్తోంది పాన్​-ఆధార్​ లింక్​ చేశారా? ఇప్పుడే చెక్​ చేసుకోండి


Also read: Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook