Kerala Assembly Election 2021 Results: తిరువనంతపురం: కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌కే (CM Pinarayi Vijayan) మరోసారి విజయం వరించింది. కేరళ ఓటర్లు పినరయి విజయన్‌కే మరోసారి పట్టంకట్టారు. ఈ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు కీలక నేతలు, ప్రముఖులు.. వారి గెలుపు, ఓటములపై ఓ చిన్న లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CPI(M) leader Pinarayi Vijayan; పినరయి విజయన్ విజయం:
కేరళలోని కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) అభ్యర్థి పినరయి విజయన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేత సి రఘునాథన్, బీజేపి అభ్యర్థి సీ.కే. పద్మనాభన్‌లను పినరయి విజయన్ ఓడించారు.


Oommen Chandy; కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ:
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పుతుప్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన సీపీఐ(ఎం) నేత జైకా సి థామస్‌పై విజయం సాధించారు.


Also read : Assembly Election Results 2021 Live Updates: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు


Health minister KK Shailaja; ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ:
పినరయి విజయన్ కేబినెట్‌లో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న కేకే శైలజ మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపి అభ్యర్థి బిజు ఎలెక్కుయిపై ఆమె విజయం సాధించారు. 


Metro man E Sreedharan; మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ని విజయం వరించిందా ? 
మెట్రో మ్యాన్‌గా పేరొందిన ఈ శ్రీధరన్ పాలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే బీజేపిలో చేరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓటమిపాలయ్యారు.


K Krishnankutty vs Adv. Sumesh Achuthan; కే క్రిష్ణకుట్టి, అడ్వకేట్ సుమేష్ అచ్యుతన్‌లలో గెలుపు ఎవరిది ?
చిట్టూర్ నియోజకవర్గం నుంచి జేడీ(ఎస్) తరపున బరిలో దిగిన కే క్రిష్ణకుట్టి కాంగ్రెస్ అభ్యర్థి అడ్వకేట్ సుమేష్ అచ్యుతన్‌పై విజయం సాధించారు.


Also read: Tamil Nadu Assembly Election 2021 Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థులు.. వారి గెలుపు, ఓటములు


E Chandrashekaran; ఈ చంద్రశేఖరన్ గెలిచారా ?
కన్హన్‌గడ్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ తరపున ఎన్నికల బరిలో నిలిచిన ఈ చంద్రశేఖరన్ కాంగ్రెస్ అభ్యర్థి పీవీ సురేష్‌పై గెలుపొందారు. 


Manjeshwar constituency; మంజేశ్వర్‌లో విజయం ఎవరిది ?
మంజేశ్వర్ నియోజకవర్గంలో పోటీకి నిలిచిన BJP నేత కే సురేంద్రన్ IUML అభ్యర్థి ఏకేఎం అశ్రఫ్ చేతిలో ఓటమిని చవిచూశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook