Metro Man Sreedharan To Join BJP: భారతీయ జనతా పార్టీ(BJP)లో మరో ప్రముఖ వ్యక్తి చేరనున్నారు. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ ఇంజనీర్ ఈ శ్రీధరన్ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మెట్రో మ్యాన్ శ్రీధరన్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 88 ఏళ్ల శ్రీధరన్ విజయ్ యాత్రలో భాగంగా బీజేపీ చేరనున్నారని కేరళ బీజేపీ విభాగం తెలిపింది.
మరికొన్ని నెలల్లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తన స్వస్థలం మళ్లాపురంలో బీజేపీ(BJP)లో చేరికపై శ్రీధరన్ ఎన్‌డీటీవీతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. గత 10ఏళ్లుగా కేరళలోనే ఉంటున్నానని, పలు ప్రభుత్వాల పనితీరును తాను చూశానన్నారు.
Also Read: EPFO: మరోసారి తగ్గనున్న PF Interest Rate, మోదీ ప్రభుత్వంలో వడ్డీ రేట్లు ఇలా మారాయి
నా అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకు బీజేపీ సరైన మార్గమని తాను భావిస్తున్నట్లు తెలిపారు అవకాశం ఇస్తే బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమేనని తన మనసులో మాటను బహిర్గతం చేశారు. కేరళ(Kerala) ఎన్నికలు తనకు ఓ మంచి అవకాశమని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు
కాగా, దేశంలో మెట్రో రైళ్ల రూపకర్తగా, మెట్రో మ్యాన్‌గా శ్రీధరన్‌కు అరుదైన ఘనత దక్కింది. శ్రీధరన్ 2011లో న్యూఢిల్లీ మెట్రో నుంచి రిటైర్ అయ్యారు. ఆ తరువాత నుంచి కేరళలోనే సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమయ్యారు. అయితే వయసురీత్యా బీజేపీ నియమాలు, నిబంధనలు శ్రీధరన్‌ను ఎన్నికల బరిలోకి దిగకుండా అడ్డుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: WhatsApp: వాట్సాప్ ప్రైవసీ వివాదం, ఏకంగా Delete వాట్సాప్ ఆప్షన్‌ను మాయం చేస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook