Kerala: త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ప్రైవేటుపరంపై అభ్యంతరం
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ( Trivandrum airport ) ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ ప్రభుత్వం ( Kerala government ) అభ్యంతరం తెలిపింది. సహకారం అందించలేమని.. ఇబ్బంది ఉంటుందని నేరుగానే ప్రధాని మోదీకు లేఖ ద్వారా స్పష్టం చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ( Trivandrum airport ) ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ ప్రభుత్వం ( Kerala government ) అభ్యంతరం తెలిపింది. సహకారం అందించలేమని.. ఇబ్బంది ఉంటుందని నేరుగానే ప్రధాని మోదీకు లేఖ ద్వారా స్పష్టం చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.
దేశంలోని మూడు విమానాశ్రయాల్ని ప్రైవేటుకు ( 3 airports to private ) అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ ( union cabinet decision ) నిర్ణయం తీసుకుంది. ఇందులో కేరళ ( kerala ) రాష్ట్రంలోని త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ( kerala cm vijayan ) నేరుగా ప్రతిఘటిస్తున్నారు. ఇదే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మేజర్ భాగస్వామిగా ఉండేలా స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఏర్పాటు చేయాలని చేసిన పలు విజ్ఞప్తుల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పినరయి విజయన్ అభ్యంతరం తెలుపుతూ..ప్రదాని మోదీకు ( keral cm letter to pm modi ) నేరుగా ఓ లేఖ రాశారు. 2003లో పౌర విమానయాన శాఖ ఇచ్చిన హామీకు ఈ నిర్ణయం వ్యతిరేకంగా ఉందన్నారు. త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ను ప్రైవేట్ కు అప్పగించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను పరిగణలో తీసుకోవాలనేది ఆ హామీ సారాంశంగా ఉందని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ ( international terminal ) ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 23.57 ఎకరాల భూమిని ఎయిర్ పోర్ట్ అధారిటీకు ఉచితంగా అందించిందన్నారు. అయితే స్పెషల్ పర్పస్ వెహికల్ ( special purpose vehicle ) గా ఈ ప్రాజెక్టుకుని పరిగణలో తీసుకున్నప్పుడు ఈ భూమి విలువను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పరిగణించాల్సి వస్తుంది.
ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...ప్రధాని మోదీను కోరారు. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ..ప్రభుత్వం సహకరించే పరిస్థితి ఉండదని పరోక్షంగా చెప్పారు. Also read: National Level Test: ఉద్యోగాలకు ఇకపై దేశమంతా ఒకటే ఎంట్రన్స్ పరీక్ష