ఇకపై దేశమంతా ఒకటే పరీక్ష . అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( Common eligibility test ). దీనికోసం జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు. ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఇదే ఇకపై విధానం. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం పలికింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ( national recruitment agency ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ( union cabinet ) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ కీలక నిర్ణయం దేశంలో నిరుద్యోగ యువతకు తోడ్పాటు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకుల్లో ఖాళీల భర్తీకు ఎన్ ఆర్ ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది.
ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ లిస్ట్ కు మూడేళ్ల వరకూ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ మూడేళ్ల వ్యవధిలో అభ్యర్ధి విభిన్న సంస్థల్లో తనకు నచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ రిక్టూట్ మెంట్ ఏజెన్సీనే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది.
Merit list of Common Entrance Test (CET) will remain valid for 3 years during which the candidate can apply for jobs in different sectors depending upon his aptitude and preferences: Union Minister Jitendra Singh on National Recruitment Agency to conduct Common Eligibility Test pic.twitter.com/TvIbeRhRVh
— ANI (@ANI) August 19, 2020
ఇప్పటివరకూ నియామక పరీక్షల్ని యూపీఎస్సీ ( upsc ) , ఎస్ ఎస్ సీ ( Ssc ) వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇకపై ఎన్ ఆర్ ఏ నిర్వహిస్తుంది. మరోవైపు జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్ పోర్టులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లను అభివృద్ధి చేసేందుకు డెవలపర్ గా ప్రభుత్వం అదానీ గ్రూప్ ( Adani group ) ను ఎంపిక చేసింది.