Bird Flu In Kerala: కేరళలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయితీలు బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లలు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఒక కిలోమీటరు పరిధిలో దాదాపు 8 వేల బాతులు, కోళ్లు, ఇతర పెట్ బర్డ్స్‌ను చంపేయాలని అధికారులను ఆదేశించింది. నెల రోజుల క్రితం బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు ఇరవై వేల పక్షులను చంపాలని ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్పుకర, తాళయాజం పంచాయతీల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసుల దృష్ట్యా జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ  ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటర్ పరిధిలో కనిపించే పక్షులను పట్టుకుని చంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని అధికారులను కూడా ఆదేశించారు కలెక్టర్. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో కోడి, బాతు, ఇతర దేశీయ పక్షులు, గుడ్లు, మాంసం, పేడ విక్రయాలను రవాణాను నిషేధించారు. 


అర్పుకరలోని డక్ ఫామ్‌లో తలయాజంలోని బ్రాయిలర్ కోళ్ల ఫారమ్‌లో పక్షులు మరణించిన తర్వాత.. నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన చోట బాధిత పంచాయతీల్లో పక్షులను చంపేందుకు పశుసంవర్థక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.


బర్డ్ ఫ్లూని ఏవీఎన్ ఇన్‌ ఫ్లూ ఎంజా అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఫ్లూ పక్షుల నుంచి పక్షులకు వ్యాపిస్తుంది. చాలా పక్షులకు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. బర్డ్ ఫ్లూ సాధారణంగా అడవి పక్షుల ద్వారా పెంపుడు పక్షులకు వ్యాపిస్తుందని అమెరికాస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది.


ఈ వైరస్ పక్షుల ప్రేగులు లేదా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసి వాటిని అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇది కూడా సాధారణ వైరస్‌లాగే వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన పక్షి లాలాజలం, ముక్కు నుంచి వచ్చే ద్రవం లేదా మలం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అది మరొక పక్షికి దగ్గరగా వస్తే ఆ పక్షికి కూడా వైరస్ సోకుతుంది. ఈ పక్షుల మాంసాన్ని ప్రజలు తిన్నా.. ఆ పక్షుల దగ్గకు వెళ్లినా మనుషులకు కూడా వ్యాపిస్తుంది. బర్డ్‌ ఫ్లూ మనషులకు సోకితే.. జ్వరం రావడం, తలనొప్పిగా ఉండడం, కండరాల నొప్పితో పాటు నిరంతరం ముక్కుకారుతుంది. అంతేకాకుండా దగ్గు, పొత్తి కడపులో నొప్పిగా రావడం, కళ్లు ఎరుపుగా మారడం, వాంతులు, గొంతులో వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 


Also Read: Bihar Hooch Tragedy: పోలీస్ స్టేషన్‌లో స్పిరిట్ మాయం.. బీహార్ కల్తీ మద్య మరణాలకు కారణం ఇదే..?   


Also Read: Bilawal Bhutto on PM Modi: గుజరాత్ కసాయి ప్రధాని మోదీ.. పాక్ విదేశాంగ మంత్రి అభ్యంతకర వ్యాఖ్యలు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook