Bihar Hooch Tragedy: పోలీస్ స్టేషన్‌లో స్పిరిట్ మాయం.. బీహార్ కల్తీ మద్య మరణాలకు కారణం ఇదే..?

Poisonous Liquor Chhapra Deaths: బీహార్‌లో ఛప్రా కల్తీ మద్యం ఘటనలో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్ పోలీస్ స్టేషన్‌లో కనిపించకుండా పోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ స్పిరిట్‌తో విషపూరితమైన మద్యం తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 12:16 PM IST
  • బీహార్‌లో 50కి చేరిన కల్తీ మద్యం మరణాలు
  • పోలీస్ స్టేషన్‌లో మాయమైన స్పిరిట్‌తో మద్యం తయారు..?
  • ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు
Bihar Hooch Tragedy: పోలీస్ స్టేషన్‌లో స్పిరిట్ మాయం.. బీహార్ కల్తీ మద్య మరణాలకు కారణం ఇదే..?

Poisonous Liquor Chhapra Deaths: బీహార్‌లోని సరన్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. సరన్‌లో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 50కి చేరుకుందని పోలీసులు తెలిపారు. ఇంకా అనేక మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చేరిన 11 మంది రోగులలో గురువారం సాయంత్రం వరకు నలుగురు మరణించారని పీఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐఎస్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు మెడికల్ ఐసీయూలో.. నలుగురు జనరల్ వార్డులో ఉన్నారని చెప్పారు.

ఈ కేసులో ఇద్దరు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. మష్రక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రితేష్ మిశ్రా, కానిస్టేబుల్ వికేష్ తివారీలను మర్హౌరాను ఎస్‌డీపీఓ యోగేంద్ర కుమార్ సిఫార్సు మేరకు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

పోలీసుల నిర్లక్ష్యమే..

సరన్‌లో కల్తీ మద్యం తాగి మృతి చెందిన కేసులో కీలక విషయం వెల్లడైంది. పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన స్పిరిట్‌ను కల్తీ మద్యం తయారు చేయడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రాథమిక స్థాయి విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మష్రక్ పోలీస్ స్టేషన్‌లోని మల్ఖానాలో ఉంచిన స్వాధీనం చేసుకున్న స్పిరిట్ కంటైనర్ నుంచి మూతలు కనిపించలేదు. చాలా కంటైనర్లలో స్పిరిట్ కూడా లేదు. స్వాధీనం చేసుకున్న స్పిరిట్‌ను మద్యం వ్యాపారులకు పోలీసులకు విక్రయించినట్లు స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలో వస్తున్నాయి. ఇందులో వాచ్‌మెన్‌ సహకారం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో ప్రస్తుతం పోలీసులు గానీ, ప్రొడక్ట్‌ అధికారులు గానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా విచారణ చేస్తున్నారు. ఛప్రా ప్రొడక్ట్ సూపరింటెండెంట్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. మష్రక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్పిరిట్ మాయమైన విషయం తమ నోటీసులో లేదన్నారు. అయితే అన్ని పోలీస్ స్టేషన్‌లలో స్వాధీనం చేసుకున్న మద్యం, స్పిరిట్‌లను పరిశీలిస్తున్నామన్నారు. వాటి నమూనాలను తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కల్తీ మద్యం తాగడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు మరణిస్తున్నారని.. కల్తీ మద్యం తాగేవాడు చనిపోవడం ఖాయన్నారు. ఇందులో కొత్తేమీ లేదంటూ వివాదాస్పద రీతిలో మాట్లాడారు. సమాజంలో ఎంత మంచి పని చేసినా ఎవరో ఒకరు తప్పు చేస్తారని.. నేరాలను అరికట్టేందుకు చట్టాలు చేసినా హత్యలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధ చట్టం వల్ల చాలా మంది లబ్ధి పొందారని అన్నారు.

Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు  

Also Read: Bilawal Bhutto on PM Modi: గుజరాత్ కసాయి ప్రధాని మోదీ.. పాక్ విదేశాంగ మంత్రి అభ్యంతకర వ్యాఖ్యలు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News