చైనా టు హోల్ వరల్డ్. ఇదీ కరోనా వైరస్ ( Corona virus ) ప్రస్థానం. 2019 డిసెంబర్ టు ..ఎప్పటివరకూ తెలియదు. దాదాపు పదినెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ కేవలం 5 వందల రూపాయలకేనా?  మన దేశపు పరిశోధకుల ఘనత ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చైనా ( China ) లో పుట్టిన కరోనా వైరస్ దాదాపుగా 10 నెలల్నించి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ( Corona second wave ) ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా పరీక్షలు నిర్వహించడం ద్వారానే బాధితులకు సత్వర చికిత్స అందించడానికి వీలవుతుంది. ఈ దిశగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఓ వైపు కొవిడ్-19 టెస్టులు ( Covid19 Tests ) సాధ్యమైనంత సులభంగా నిర్వహించే కొత్త విధానాన్ని ఆవిష్కరించడానికి మరోవైపు వ్యాక్సిన్ అభివృద్దికి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు  చేస్తున్నారు.


ఇప్పటికే కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవడం సామాన్యుడికి భారంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో అతి తక్కువ ఖర్చుతో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల్ని చేసే  విధానాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్ ( Kharagpur IIT )‌ పరిశోధకులు కనుగొన్నారు. కొవిరాప్‌ అనే ఈ పరికరం ఖరీదు కేవలం  పదివేల రూపాయలు కాగా...ఒకసారి పరీక్ష చేసేందుకు కేవలం 5 వందలవుతుందని అంటున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు సుమన్‌ చక్రబర్తి, డాక్టర్‌ అరిందమ్‌ మొండెల్‌ల నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించింది. ఇప్పుడీ విధానానికి ఐసీఎంఆర్‌ సైతం అనుమతివ్వడం విశేషం. ఈ విధానం అత్యంత చవక, అత్యంత సులభమే కాదు..అతి కచ్చితం కూడా. కేవలం గంట వ్యవధిలోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. Also read: Kerala Gold Smuggling: కిలో బంగారానికి రూ.45వేల కమిషన్.. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు