కేరళ గొల్డ్ స్మగ్లింగ్ ( Kerala Gold Smuggling ) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులు ప్రధాన నిందితుడు అయిన సందీప్ నాయర్ ( Sandeep Nair ) ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు. యూఏఈ ( UAE ) కాన్సులేట్ జనరల్ లో సెక్రటరీగా విధులు నిర్వర్తించే సమయంలో స్వప్న సురేష్ కమిషన్ తీసుకుని బంగారం స్మగుల్ చేయడానికి అంగీకరించింది అని వెల్లడించాడు. ఒక కిలో బంగారానికి రూ. 45000 కమిషన్ తీసుకుని దౌత్యవేత్తలకు అందించే ప్రత్యేక బ్యాగేజ్ సదుపాయంలో తరలించడానికి వారి మధ్య ఒప్పందం జరిగిందట.
అయితే రూ.45 వేల కమిషన్ ఇస్తామన్నా సరిపోదు అని స్పప్న సురేష్ తెలిపిందట. ఈ కేసులో మరో నిందితుడు అయిన కేటీ రమీస్ స్మగ్లింగ్ చేసే కొత్త విధానాలను వెతుకుతూ ఉండేవాడట. ఈ విషయం గురించి తెలిపిన సందీప్ నాయర్ ...నాకు సరితా, రీమస్ చాలా కాలం నుంచి తెలుసు అని. స్వప్నను నాకు సరితా పరిచయం చేసింది అని వివరించాడు. ఎంఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తో సందీప్ ఈ విషయాలు తెలిపినట్టు సమాచారం.
- ALSO READ | RRRపై సస్పెన్స్ పెంచిన రామ్ చరణ్, తారక్ ట్వీట్స్
స్వప్న సురేష్ కు ఉన్న డిప్లమాటిక్ బ్యాగేజ్ సదుపాయంతో బంగారం (Gold ) అక్రమ రవాణా చేయడం చాలా సులభం అని సరితా తెలిపింది అని వెల్లడించాడు. 2019లో సరితా కారు ద్వారా తొలిసారి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్ కు తెలుసు అని తెలిపాడు. ఇంతా తెలిసినా ఆమెను పదోన్నతికి ప్రోత్సాహించాడు అని తెలిపాడు నాయర్.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR