Agnipath Protest: విధ్వంసం జరుగుతుంటే కేటీఆర్ రెచ్చగొట్టారు! సికింద్రాబాద్ అల్లర్లపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్లు...
Agnipath Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. భారీగా విధ్వంసానికి దిగారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సికింద్రాబాద్ లో అల్లర్లు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు
Agnipath Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. భారీగా విధ్వంసానికి దిగారు. దీంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో వినయ్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అతని ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వినయ్ ను రక్షించేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్ అల్లర్లు, పోలీసులు కాల్పుల ఘటనతో దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. హైదరాబాద్ పరిస్థితిని వివరించారు. షాతో సమావేశం తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సికింద్రాబాద్ లో అల్లర్లు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అగ్నిపథ్ వంటి మంచి పథకం తీసుకువస్తే అల్లర్లు జరగడం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి. దాడుల భయంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే కుట్ర చేశారని.. రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. రైల్లే స్టేషన్ లో విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు స్పందించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. బోగీలను ధ్వంసం చేసి.. రైల్వే కోచ్‌లకు నిప్పుపెట్టినా హైదరాబాద్ పోలీసులు ఎందుకు రాలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. సికింద్రాబాద్ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందన్న కిషన్ రెడ్డి.. అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలన్నారు.
అగ్నిపథ్ పథకం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదని.. ప్రపంచ దేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించి తీసుకొచ్చామని కిషన్ రెడ్డి చెప్పారు. అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. అనేక దేశాల్లో అగ్నిపథ్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయన్నారు. అగ్నిపథ్ స్కీమ్ కంపల్సరి కాదని.. స్వచ్ఛందంగా వచ్చేవాళ్లే చేరుతారని తెలిపారు. ఇజ్రాయిల్‌లో 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉందన్నారు. యూఏఈలోనూ ఆరేళ్ల నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అగ్నివీరుడు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని కిషన్ రెడ్డి చెప్పారు.
Read also: Agnipath Protest: ఆర్మీలో చేరాలని కలలు కన్న రైతు బిడ్డ.. పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు!
Read also: Agnipath Protest: పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం! బీజేపీ జాతీయ సమావేశాలను డిస్ట్రబ్ చేసే కుట్ర ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.