Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.ఇంకా వందలాది మంది నిరసనకారులు పట్టాలపైనే ఉన్నారు. రైల్వే ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నా నిరసనకారులు శాంతించడం లేదు. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. అగ్నిపథ్ పథకం ఆందోళనలో మృతి చెందిన యువకుడిని దామోదర్ కురేషియాగా గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. అగ్నిపథ్ తో యువతకు తీరని నష్టం.. పోరాడుదాం రండి.. కదిలి రండి అంటూ మెసేజ్ లు పెట్టుకున్నారు. సికింద్రాబాద్ కు తరలిరావాలని పిలుపిచ్చారు. ఈ వాట్సాప్ మెసెజ్ తోనే వేలాది మంది నిరుద్యోగ యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చారని భావిస్తున్నారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఆదివారం నుంచి రైల్వే స్టేషన్ ముట్టడి నిరసన కారులు ప్లాన్ చేశారు. ఈనెల 15వ తేదిన మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అదే రోజు రాత్రి వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్ పెట్టారు. ఈ గ్రూపులలో ఒక్క రోజులోనే మొత్తం 1000 మంది జాయిన్ అయ్యారు. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకల్లా బసులు, టాక్సీ లు, ప్రైవేట్ బండ్లు మాట్లాడుకుని హైద్రాబాద్ వచ్చారు స్టూడెంట్స్. మరికొందరు అభ్యర్థులు గురువారం రాత్రి 10 గంటలకే రైల్వే స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలకు చేరుకున్నారు దాదాపు 500 మంది స్టూడెంట్స్. రాత్రే స్టేషన్ లోపలకి దాదాపు 100 మంది నిరసనకారులు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఎగ్జామ్ పెట్టాలని రైల్వే స్టేషన్ ముట్టడించాలని మొదట ప్లాన్ చేశారు. అయితే నిరసన అదుపుతప్పి విధ్వంసానికి దారి తీసింది. ఫోన్స్, మెసేజ్ ల ద్వారా ఎప్పటికప్పుడు నిరసనకారులు టచ్ లో ఉన్నారని గుర్తించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదన్నారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బండి సంజయ్.అగ్నిపథ్ కు ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని, టిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని చెప్పారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలను డిస్ట్రబ్ చేసే కుట్రలతోనే ఇదంతా చేస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Hyderabad | Agnipath protestors set fire to 4-5 train engines & 2-3 coaches. We'll analyse the extent of the damage. Info of one person being injured. Train services temporarily halted for safety of passengers: AK Gupta, Divisional Railway Manager at Secunderabad railway station pic.twitter.com/IIhk1Ht50n
— ANI (@ANI) June 17, 2022
Read Also: Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు..చేయి దాటిపోతున్న పరిస్థితి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.