Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచింది. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని రైళ్లు రద్దయ్యాయి. ఇక సికింద్రాబాద్ లో జరిగిన పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడిని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేటకు చెందిన రాకేష్ గా గుర్తించారు.
కుగ్రామానికి చెందిన రాకేష్ ది రైతు కుటుంబం. రాకేష్ తండ్రి కుమారస్వామి రైతు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. రాకేష్ చిన్నవాడు. రాకేష్ సోదరి బిఎస్ఎఫ్ జవాన్ గా పశ్చిమబెంగాల్లో పనిచేస్తోంది. సోదరి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని రాకేష్ కలలుకన్నాడు. ఆర్మీలో చేరేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. రాకేష్ మృతితో దబీర్ పేటలో తీవ్ర విషాదం అలుకుముంది. స్థానిక పోలీసులు రాకేష్ చనిపోయాడన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. రాకేష్ తల్లిదండ్రులను కారులో సికింద్రాబాద్ తీసుకువెళ్లారు పోలీసులు.
సికింద్రాబాద్ లో జరిగిన కాల్పుల్లోనే గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందుతోంది.
Read Also: Agnipath Protest: పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం! బీజేపీ జాతీయ సమావేశాలను డిస్ట్రబ్ చేసే కుట్ర ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.