కాలం కలిసిరాకపోతే కోటిశ్వరుడు బిచ్చగాడిగా మారతాడు.. కలిసొచ్చిందంటే పూటకి పట్టెడు మెతుకులు దొరకనివాడు కుభేరవుతాడు. ఓ కార్మికుడికి టైమ్ కలిసొచ్చింది. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గురువారం ఇది జరిగింది. రానా, మిహికా పెళ్లి సందడి షురూ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుబాల్ అనే కార్మికుడు పన్నాలోని ఓ గని (Diamonds Mine)లో పని చేస్తున్నాడు. గనిలో తవ్వుతుండగా అతడికి మూడు వజ్రాలు దొరికాయి. వీటి బరువు 7.5 క్యారట్లు అని జిల్లా డైమండ్ అధికారి ఆర్కే పాండే తెలిపారు. వీటి విలువ రూ.30 నుంచి రూ.35లక్షల వరకు ఉంటుంది. సుబాల్ వీటిని తమకు అప్పజెప్పినట్లు తెలిపారు.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...


ప్రభుత్వం ఈ మూడు వజ్రాలను వేలం వేస్తుంది. అందులో వచ్చిన నగదులో 12శాతం ట్యాక్స్ విధించి, మిగతా సొమ్మును కార్మికుడికి అందించనున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల కిందట ఇదే జిల్లాలోని గనిలో మరో కార్మికుడికి 10.69 క్యారట్స్ వజ్రం దొరకడం తెలిసిందే. తాజాగా సుబాల్ పంట పండింది. COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. చివరి దశలో ప్రాణాలకే ముప్పు
  మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి