March Bank Holidays: మార్చి నెలలో బ్యాంకు సెలవు దినాలు అన్ని రోజులా?
Bank Holidays In Telangana: ఈ ఏడాది మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవు దినాలు వచ్చాయి. బ్యాంకు యూనియన్ల సమ్మె కూడా తోడవడంతో దాదాపు సగం రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.
హైదరాబాద్: మార్చి నెలలో బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ఈ నెలలో బ్యాంకుల సెలవు దినాల వివరాలు తెలుసుకుని మీ లావాదేవీలు చేసుకోవడం ఉత్తమం. జనవరి తరహాలోనే ఈ నెలలో భారీగా సెలవు దినాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్ల సమ్మె కారణంగా మరో మూడు రోజులు అదనంగా బ్యాంకులు సేవలు అందుబాటులో ఉండవు. మార్చి 1 తొలి రోజుతోనే బ్యాంకు సెలవు దినం మొదలవుతుంది.
Also Read: మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!
మార్చి నెలలో 1, 8, 10, 14, 15, 22, 25, 28, 29 తేదీలు సెలవు దినాలు. కాగా మార్చి 1, 8, 15, 22, 29 ఆదివారాలు (14, 28 రెండో శనివారాలు) ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ కారణంగా బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. మార్చి 10న (మంగళవారం) హోలీ, మార్చి 25న (బుధవారం) తెలుగు సంవత్సరాది ఉగాది పండుగని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవులు.
Also Read: భారీగా సర్వీస్ ఛార్జిలను పెంచి ఆ కస్టమర్లకు షాక్ ఇచ్చిన SBI
కాగా, ఈ నెలలో బ్యాంకు యూనియన్లు సమ్మెబాట పడతామని ఇదివరకే ప్రకటించాయి. నేపథ్యంలో మార్చి 11, 12, 13 మూడు రోజులు అదనంగా బ్యాంకులు పనిచేయకపోవచ్చు. అయితే మార్చి 5 కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద జరిగే చర్చలతో ఈ మూడు రోజులపాటు బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయా లేదా అనేదానిపై స్పష్టత రానుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
AlSo Read: టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!.. ఫొటోలు
Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్