3వ విడత లోక్ సభ ఎన్నికలు పోలింగ్ లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్
దేశ వ్యాప్తంగా నేడు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 117 లోక్ సభ నియోజకవర్గాల్లో 3వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 117 స్థానాలకుగాను 1640 అభ్యర్థులు పోటీపడుతున్నారు.
దేశ వ్యాప్తంగా నేడు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 117 లోక్ సభ నియోజకవర్గాల్లో 3వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 117 స్థానాలకుగాను 1640 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 కోట్ల 85 లక్షలకుపైగా ఓటర్లు ఈ పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుజరాత్‌లోని అన్ని 26 లోక్ సభ స్థానాలు, కేరళలోని 20 లోక్ సభ స్థానాలు, గోవాలోని 2 లోక్ సభ స్థానాలతోపాటు దాద్రా నగర్ అండ్ హవేలి, డామన్ అండ్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కో లోక్ సభ నియోజకవర్గం చొప్పున నేడు పోలింగ్ జరగనుంది.
ఇవేకాకుండా అస్సాంలో 4, బీహార్‌లో 5, ఛత్తీస్‌ఘడ్‌లో 7, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఒడిషాలో 6, ఉత్తర్ ప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్ 5, త్రిపురలో 1, జమ్ముకశ్మీర్‌లో 1 లోక్ స్థానానికి నేడు పోలింగ్ జరగనుంది.
Latest Updates
ఎన్నికల నిర్వహణ అధికారిపై బీజేపీ కార్యకర్తలు దాడి:
మొరాదాబాద్: లోక్ సభ ఎన్నికలు 3వ విడత పోలింగ్‌లో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఓ అధికారిపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 231వ పోలింగ్ కేంద్రంలో విధుల్లో పాల్గొన్న అధికారి మహమ్మద్ జుబైర్ ఈవీఎంలో సైకిల్ గుర్తుపై వున్న మీట నొక్కాల్సిందిగా ఓటర్లకు సూచిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపి కార్యకర్తలు అతడిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఓ వీడియోను ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంది.
కేంద్ర భద్రతా బలగాలపై మమతా బెనర్జి సంచలన ఆరోపణలు :
ఆరాంబాఘ్: కేంద్ర భద్రతా బలగాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపి ఓటు వేయమని ఓటర్లకు చెబుతూ కేంద్ర భద్రతా బలగాలు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి కోసమే పనిచేస్తున్నాయని మమతా బెనర్జి ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మమతా బెనర్జి తెలిపారు. మరింత అధిక సమాచారం కోసం..
ప్రధాని నరేంద్ర మోదీపై హార్థిక్ పటేల్ సెటైర్లు:
చౌకిదార్‌ని వెతుక్కోవాలంటే తాను నేపాల్ వెళ్తే సరిపోతుందని, కానీ తనకు కావాల్సింది చౌకిదార్ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, విద్యార్థిని, విద్యార్థులు, యువతకు బంగారు భవిష్యత్తును అందించే ప్రధాన మంత్రి కావాలని కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ అన్నారు. తాను దేశానికి కాపలా కాస్తున్న ఓ చౌకిదార్‌ని అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకోవడాన్ని పరోక్షంగా విమర్శిస్తూ హార్థిక్ పటేల్ ఈ వ్యంగ్యస్త్రాలు సంధించారని ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు; బాంబుదాడి ఘటనలో ముగ్గురికి గాయాలు:
మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముర్షిదాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ దోమకల్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద బాంబు దాడులు జరిగాయి . ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారు. స్థానిక ఆస్పత్రికి తరలించి వారిని చికిత్స నందిస్తున్నారు. గాయపడ్డ వారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెందిన తూజమ్ అన్సారీ (50), మసాదుల్ ఇస్లామ్ (35), మాలిక్ మండల్ (27)గా గుర్తించారు
West Bengal: Three TMC workers injured after a crude bomb was hurled at them. The incident took place in Domkal municipality in Murshidabad pic.twitter.com/zHlVechLCz
-
వయనాడ్: ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి లోక్ సభ నియోజకవర్గంతోపాటు కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, 3వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగుతున్న వయనాడ్ లోక్ సభ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెళ్లప్పల్లి ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొస్తూ ఓ లేఖ రాశారు.
మాజీ ఐఏఎస్, మాజీ ఐపిఎస్ మధ్య హోరాహోరి పోటికి వేదికైన లోక్ సభ స్థానం:
భువనేశ్వర్: ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థుల్లో ఒకరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాగా మరొకరు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కావడమే అందుకు ప్రధాన కారణం. మరింత అధిక సమాచారం కోసం...
-
లోక్ సభ ఎన్నికలు 3వ విడత పోలింగ్‌లో భాగంగా నేడు అహ్మెదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అంతకన్నా ముందుగా తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రనిప్ ప్రాంతంలోని నిశాన్ విద్యాలయలోని పోలింగ్ కేంద్రం వద్ద మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.