కేంద్ర భద్రతా బలగాలపై మమతా బెనర్జి సంచలన ఆరోపణలు

కేంద్ర భద్రతా బలగాలపై మమతా బెనర్జి సంచలన ఆరోపణలు

Pavan Reddy Naini Pavan | Updated: Apr 23, 2019, 06:50 PM IST
కేంద్ర భద్రతా బలగాలపై మమతా బెనర్జి సంచలన ఆరోపణలు
File pic

ఆరాంబాఘ్: కేంద్ర భద్రతా బలగాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపి ఓటు వేయమని ఓటర్లకు చెబుతూ కేంద్ర భద్రతా బలగాలు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి కోసమే పనిచేస్తున్నాయని మమతా బెనర్జి ఆరోపించారు. మల్డహ దక్షిణ్, బలూర్‌ఘాట్ నియోజకవర్గాల్లో ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో బీజేపికి ఓటు వేయాల్సిందిగా భద్రతా బలగాలు ఓటర్లకు పిలుపునిస్తున్నాయని ఆమె అన్నారు. 

మల్డహ దక్షిణ్ లోని ఇంగ్లిష్ బజార్ లో వున్న పోలింగ్ కేంద్రంలోపల కూర్చున్న భద్రతా బలగాలు ఓటర్లకు ఈమేరకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తనకు స్పష్టమైన సమాచారం అందిందని, ఈ విషయమై ఇప్పటికే తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మమతా బెనర్జి తెలిపారు.