మాజీ ఐఏఎస్, మాజీ ఐపిఎస్ మధ్య హోరాహోరి పోటి !

మాజీ ఐఏఎస్, మాజీ ఐపిఎస్ మధ్య హోరాహోరి పోటి !

Last Updated : Apr 23, 2019, 12:28 PM IST
మాజీ ఐఏఎస్, మాజీ ఐపిఎస్ మధ్య హోరాహోరి పోటి !

భువనేశ్వర్: ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థుల్లో ఒకరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాగా మరొకరు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కావడమే అందుకు ప్రధాన కారణం. భువనేశ్వర్ లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అపరాజిత సారంగి పోటీపడుతుండగా ఒడిషా అధికార పార్టీ బిజు జనతా దళ్ (బీజేడి) అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అరూప్ పట్నాయక్ బరిలో నిలిచారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపికి సవాల్ విసురుతూ ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న ఒడిషా అధికారిక పార్టీ బిజేడికి మధ్య పోటీగా భువనేశ్వర్ లోక్ సభ ఎన్నికను అభివర్ణిస్తున్నారు అక్కడి ఓటర్లు. 

3వ విడత లోక్ సభ ఎన్నికలు పోలింగ్ లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్

ఇదిలావుండగా ఇవాళ పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, బీజేపి అభ్యర్థి అపరాజిత సారంగి భువనేశ్వర్‌లోని ఐఆర్‌సి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుందో తెలియాలంటే మే 23వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

Trending News