Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల సందడి మొదలౌతోంది. ఏడుదశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. తొలిదశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలిదశ పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. దాంతోపాటే ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈనెల 27 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశముంటుంది. 28వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 30వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది. 


లోక్‌సభ తొలిదశ ఎన్నికల్లో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు కూడా తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. తరువాత రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గానూ తొలిదశలో 12 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇక 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో తొలి దశలో 8  స్థానాలకు, మద్యప్రదేశ్‌లో 6, అస్సోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ము కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. 


లోక్‌సభ ఎన్నికల తొలి దశ షెడ్యూల్


మార్చ్ 20 ఎన్నకల నోటిఫికేషన్
మార్చ్ 20 నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
మార్చ్ 27 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
మార్చ్ 28 నామినేషన్ల పరిశీలన
మార్చ్ 30 నామినేషన్ల ఉపసంహరణ
ఏప్రిల్ 19 పోలింగ్


Also read: JEE NEET Free Coaching: జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత కోచింగ్, వసతి, భోజనం కూడా ఫ్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook