JEE NEET Free Coaching: జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత కోచింగ్, వసతి, భోజనం కూడా ఫ్రీ

JEE NEET Free Coaching: జేఈఈ, నీట్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. జేఈఈ అడ్వాన్స్, నీట్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు ఉచితంగా కోచింగ్ లభించనుంది. ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2024, 02:32 PM IST
JEE NEET Free Coaching: జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత కోచింగ్, వసతి, భోజనం కూడా ఫ్రీ

JEE NEET Free Coaching: ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు మంచి అవకాశం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ సౌకర్యం కల్పిస్తోంది. అది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకు అవసరమైన కోచింగ్ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండేవారికి ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. కేవలం కోచింగ్ ఒక్కటే కాకుండా ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అంటే వసతి, భోజనం కూడా ఉచితంగా లభిస్తుంది. 

బీహార్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఈ ఉచిత శిక్షణా ఏర్పాట్లు చేస్తోంది. అప్లై చేసేందుకు చివరి తేదీ మార్చ్ 28 మాత్రమే. ఈ కోచింగ్‌లో ఐఐటీ జేఈఈ , నీట్ పరీక్షలకు సంబంధించిన శిక్షణతో పాటు ఉచితంగా మెటీరియల్ అందిస్తారు. శిక్షణ సమయంలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యముంటుంది. నెలలో రెండుసార్లు ఓఎంఆర్ పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్షలుంటాయి. తరగతి గదులన్నీ ఏసీ, డిజిటల్ బోర్డ్ సౌకర్యం కలిగి ఉంటాయి. 

కోటా, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోని ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్లలో నిష్ణాతులైన సిబ్బందితో నీట్, జేఈఈ కోచింగ్ ఇప్పిస్తారు. బీహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ coaching.biharboardonline.com.లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కేవలం 100 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా విద్యార్ధుల ఎంపిక జరుగుతుంది. 

ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు జేఈఈ లేదా నీట్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు ఇది మంచి అవకాశమని బీహార్ ప్రభుత్వం చెబుతోంది. ఆసక్తి కలిగిన, అర్హులైన విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మార్చ్ 28 వతేదీ చివరి తేదీ. 

Also read: Passport Tips: ఇలా అప్లై చేస్తే కేవలం 5 రోజుల్లోనే పాస్‌పోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News