LPG Price Cut: కొత్త సంవత్సరంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వంట గ్యాస్ మరింత చౌకగా ఉంటుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలను తగ్గింపును ప్రకటించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం వినియోగదారులకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉందంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ను రీఫిల్ చేయడానికి రూ.1053 చెల్లించాల్సి ఉంది. హైదరాబాద్‌లో రూ.1,105, కోల్‌కతాలో రూ.1079, ముంబైలో రూ.1052.50, చెన్నైలో రూ.1068. పాట్నాలో రూ.1151, లక్నోలో 1090 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. 6 జూలై 2022 నుంచి LPG సిలిండర్ల ధరలలో ప్రభుత్వ చమురు కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. కాగా ఈ కాలంలో క్రూడాయిల్ ధరల్లో భారీ పతనం చోటు చేసుకుంది. ఈ కాలంలో ముడి చమురు ధరలు 30 శాతం తగ్గాయి. 


రూ.150 పెరిగింది


ఈ ఏడాది ప్రభుత్వ చమురు కంపెనీలు దేశీయ వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు దాదాపు రూ.150 పెంచాయి. గతేడాది అక్టోబర్ 2021లో దేశీయ వంట గ్యాస్ రూ.899కి అందుబాటులో ఉన్నప్పుడు ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు డాలర్ $ 85 ఉన్నప్పుడు.. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్‌కు సుమారు $ 83 ట్రేడ్ అవుతోంది. భారత బాస్కెట్ ధర బ్యారెల్‌కు సుమారు $ 77గా ఉంది. దేశీయ వంట గ్యాస్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వ చమురు కంపెనీలు ఇదే కారణం.  


రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంతో ఒత్తిడి పెరిగింది


వంటగ్యాస్ ధర విషయంలో మోదీ సర్కార్‌పై అన్ని వైపులా నుంచి దాడి చేస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వంటగ్యాస్ గురించి నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. 2014లో గృహోపకరణాల వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.414కి ఎలా లభించిందో గుర్తుచేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ నుంచి 500 రూపాయలకు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. జైపూర్‌లో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1056. అంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సగం ధరకే ఎల్పీజీ సిలిండర్లను ప్రజలకు అందజేస్తుంది. రాజస్థాన్ ప్రభుత్వ ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. కొత్త సంవత్సరంలో గృహాలకు వాడే వంటగ్యాస్‌ ధరల్లో తగ్గుదలకు ఇది కూడా కారణంగా నిపుణుల చెబుతున్నారు.


Also Read: MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?


Also Read: Shantanu Singh: రాబిన్ శర్మ టీంలో శాంతను సింగ్, తెలుగుదేశం పార్టీకు వరమేనా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook