Maharashtra CM: అలిగిన ఏక్ నాథ్ షిండే.. సీఎం పదవిపై తేలని లొల్లి..
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచినా.. సీఎం పదవిపై మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. ఇది డైలీ సీరియల్ ను తలపిస్తోంది. సీఎం పదవిపై బీజేపీ, శివసేన షిండే మధ్య ఊగిసలాడుతోంది. గత ఎన్నికల్లో ఉద్ధవ్ బీజేపీతో ఎలా బిహేవ్ చేసాడో.. ఇపుడు సీఎం పదవి కోసం అదే సీన్ ను ఏక్ నాథ్ షిండే రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా బీజేపీపై ఏక్ నాథ్ షిండే అలిగినట్టు కనిపిస్తోంది.
Maharashtra CM: మహా రాష్ట్రలో మహా రాజకీయం రస కందాయంలో పడింది. శివసేన షిండేకు తక్కువ సీట్లు వచ్చినా.. సీఎం పదవి నాకే ఇవ్వాలన పట్టుబడుతున్నాడు ఏక్ నాథ్ షిండే. కానీ బీజేపీ హై కమాండ్ మాత్రం .. తమ పార్టీకి చెందిన నేతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. రోజులు గడుస్తున్నా...మహారాష్ట్ర నుంచి రాజకీయం హస్తినకు చేరినా కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడటం లేదు. ఇదో మిస్టరీ త్రిల్లర్ కాకుండా డైలీ సీరియల్ లా సాగుతోంది. ఎన్నికల ఫలితాలు విడుదలై శనివారంతో వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా క్లారిటీ రావటం లేదు. నిన్న జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దు కావడంతో ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అడుగులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ మహారాష్ట్ర మాస్ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో భేటి అయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఫడణవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు అగ్ర నేతల మధ్య కీలక భేటి జరగాల్సి ఉంది. కొత్త సీఎం ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారనే ప ప్రచారం జరిగింది. కానీ, ఏక్‌నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
తాజాగా బీజేపీ హై కమాండ్ తన పార్టీ పట్ల వ్యవహరిస్తోన్న తీరు పట్ల షిండే అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడలేదనే సంకేతాలు ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ ముదిరి పాగానా పడింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు షిండే వర్గాలు తెలిపాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
తమ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదంటున్నారు. ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతి త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి 132 సీట్లు.. షిండే శివసేనకు 57.. అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లలో విజయం సాధించాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని షిండే, అజిత్ పవార్ లు బీజేపీ ముందు తమ డిమాండ్ల చిట్టాను పెట్టాయి. భాగస్వామ్య పక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని అజిత్ వర్గం పట్టుబడుతున్నారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు.
మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్‌నాథ్ షిండే ముందుగా డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని మెలిక పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదనే వాదన తెరపైకి వచ్చింది.
ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం పోస్టుపై షిండే శివసేనలో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతున్నారు. మరో వర్గం అవసరం లేదని చెబుతుంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించారు. కానీ దేవేంద్ర ఫడణవీస్.. సీఎం పదవి తర్వాత డిప్యూటీ సీఎం పదవి స్వీకరించిన విషయాన్ని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.
కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్‌నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. ఉద్ధవ్ వేసిన తప్పటడుగు ఆయన వేయబోరనే వాదన వినిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్‌నాథ్ షిండే చెప్పారు.అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter