కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి ఆ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రదాని మోదీను కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మహారాష్ట్ర ( Maharashtra ) లో కరోనా వైరస్ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముంబైలో శాశ్వత అంటువ్యాధుల చికిత్స ఆసుపత్రి అవసరముందని...దీనికి కేంద్ర సహాయం కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే ( Maharashtra cm Udhav Thackeray )..ప్రధాని నరేంద్రమోదీను కోరారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ( Pm Modi video conference ) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నోయిడా, ముంబై, కోల్ కత్తాలోని మూడు కేంద్రాల్లో అత్యాధునిక కరోనా టెస్టింగ్ సదుపాయాల్ని కల్పించింది. ఈ కేంద్రాల్ని ప్రధాని మోదీ, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్ గా ప్రారంభించారు. 


ముంబై సమీపంలో శాశ్వత ప్రాతిపదికన అంటువ్యాధి చికిత్స ఆసుపత్రి నిర్మించాలని అనుకుంటున్నట్టు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మోదీకు తెలిపారు. రోగులకు చికిత్సతో పాటు పరిశోధన కూడా సాగేలా సదుపాయాలు ఉండాన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర సహాయం అవసరమని కోరారు. Also read: Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం