Bombay High court Judgement:  బోంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బోంబై హైకోర్టు ( Bombay High court ) నాగపూర్ బెంచ్ జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వస్త్రాలపై నుంచి బాలిక ఛాతి భాగంలో తాకడం నేరం కాదని..స్కిన్ టు స్కిన్ టచ్ లేదు కాబట్టి..పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడిగా పరిగణించలేమంటూ జస్టిస్ పుష్ప ( Justice Pushpa ) తీర్పిచ్చారు. ఈ తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే ఈ తీర్పును సవాలు చేస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ( Supreme court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ( Justice SA Bobde ) ..ఆ తీర్పుపై స్టే విధించారు. తుది విచారణ ముగిసేవరకూ నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని..మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరముందని కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. 


మరోవైపు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government ) స్పందించాలని.. పలువురు హైకోర్టు న్యాయవాదులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Uddhav thackeray ) కు లేఖ రాశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు..పోక్సో అంటే లైంగిక పరమైన దాడుల్నించి చిన్నారుల రక్షణ చట్టాన్ని నీరుగార్చేవిధంగా ఉందని ఆ న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే..న్యాయనిపుణులతో చర్చించారు. స్పెషల్ లీవ్ పిటీషన్ ( Special leave petition ) దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.


Also read: Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook