మహారాష్ట్ర ( Maharashtra ) లో కరోనా వైరస్ ( Corona virus )  మరోసారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government ) కోవిడ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో  లాక్‌డౌన్‌ను నవంబర్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టే..మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై కఠిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 వరకూ లాక్‌డౌన్‌ను ( Lockdown extended till november 30 ) పొడిగించింది. అటు ఢిల్లీలో కూడా గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఢిల్లీ ( Delhi ) లో గత 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా  5 వేల 673 కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. అటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ( Central health minister Dr harshvardhan ) సైతం ఢిల్లీలో కరోనా వైరస్ మూడవ దశ నడుస్తోందని చెప్పడం ఈ ఆందోళనను మరింతగా పెంచుతోంది. అటు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ( Delhi minister Satyendra jain ) సైతం కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. ఢిల్లీలో మూడవదశ నడుస్తుందనేది అప్పుడే చెప్పలేమని..మరో వారం రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు. మూడవ దశకు చేరే అవకాశం మాత్రం ఉందని ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు దాదాపున 4 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో రోజుకు 15 వేల కొత్త కేసులు నమోదయ్యే పరిస్థితి వస్తుందని ఇప్పటికే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( National centre for disease control ) హెచ్చరించింది. ఇప్పటికే స్కూల్స్, పాఠశాలల్ని మరో నెలపాటు మూసివేశాయని ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రస్తుతం మహారాష్ట్రలో 1 లక్షా 30 వేల 286 యాక్టివ్‌ కేసులున్నాయి. అన్‌లాక్‌ ( Unlock ) ప్రక్రియలో భాగంగా ఈనెల ప్రారంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతం కెపాసిటీ మించకుండా హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, బార్లను తెరిచేందుకు అనుమతించింది.  స్కూళ్లు, కాలేజీలు విద్యాసంస్ధలను మాత్రం అనుమతించలేదు. అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం ప్రత్యేక సబర్బన్‌ రైళ్ల రాకపోకలను అధికారులు అనుమతించారు. మరోవైపు సాధారణ ప్రజలకు లోకల్‌ రైళ్ల పునరుద్ధరణ కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పశ్చిమ, కేంద్ర రైల్వేలకు లేఖ రాసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దశలవారీగా సబర్బన్‌ రైళ్ల పునరుద్ధరించాలని లేఖలో ప్రభుత్వం రైల్వేలకు సూచించింది. 


గత 24 గంటల్లో అత్యధికంగా 6 వేల 738 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  16 లక్షల 60 వేలకు చేరుకుంది. అటు గత 24 గంటల్లో 91 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 43 వేల 554 మంది మరణించారు. Also read: Pulwama attack: పుల్వామా దాడిపై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు