Maharashtra: కొత్త ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే కీలక నిర్ణయం, పెట్రోల్-డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు
Maharashtra: పెరిగిన ఇంధన ధరల్నించి మహారాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా..
Maharashtra: పెరిగిన ఇంధన ధరల్నించి మహారాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా..
మహారాష్ట్ర ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కాస్త ఊరట లభించింది. కొత్తగా ఏర్పడిన ఏకనాథ్ శిందే ప్రభుత్వం పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 3 రూపాయలు వ్యాట్ తగ్గిస్తూ మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.ఇదే విషయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ కూడా చేశారు. వ్యాట్ తగ్గింపుతో మహారాష్ట్ర ప్రభుత్వంపై 6 వేల కోట్ల భారం పడనుంది. అయితే ద్రవ్యోల్బణం అదుపులో వస్తుందని ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే తెలిపారు.
ముంబైలో లీటర్ పెట్రోల్ ప్రస్తుతం 111.35 రూపాయలు కాగా 5 రూపాయల తగ్గింపు అనంతరం 106.35 రూపాయలవుతుంది. ఇక డీజిల్ లీటర్ ధర 97.28 రూపాయలు కాగా 3 రూపాయలు తగ్గింపు అనంతరం 94.28 రూపాయలకు లభించనుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గతంలో ఉన్న ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం వ్యాట్ తగ్గించేందుకు అంగీకరించలేదు. ఇప్పుడు శివసేన రెబెల్ నేత ఏకనాథ్ శిందే ముఖ్యమంత్రి కాగానే..వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.