Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారింది.కేవలం 24 గంటల వ్యవధిలో  50 వేల కేసులు నమోదవడం పరిస్థితి ప్రమాదాన్ని సూచిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ (Corona virus) మహమ్మారి కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో పరిస్థితి అదుపు తప్పుతోంది. కేవలం గత 24 గంటల వ్యవధిలో 49 వేల 447 కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు 277 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల 1 వేయి 172 యాక్టివ్‌ కేసులున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 37 వేల 821 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.


మహారాష్ట్రలో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో(Maharashtra) గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి సునామీలా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. ఆరోగ్య శాఖ అందించిన వివరాల మేరకు గత శనివారం మార్చి 27 Maనుంచి 3 లక్షల 15 వేల 712 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు ముంబైలో గత 24 గంటల్లో 9వేల 108 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 27 మంది మృతి చెందారు. అదే విధంగా గత వారం రోజుల వ్యవధిలో కరోనా రోగుల సంఖ్య 55 వేల 684 నమోదు కావడం అత్యంత ఆందోళన కరమైన విషయంగా పరిగణిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పూణేలో మినీ లాక్‌డౌన్‌ ( Mini lockdown in pune) ప్రకటించారు. గత 24 గంటల్లో పూణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 5 వేల 778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు.


రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రతను పరిగణలో తీసుకున్న మహారాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్ధులంతా పాస్ అయినట్టు ప్రకటించారు. 9, 11వ తరగతి విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. 


Also read: Ramnath kovind: మెరుగుపడిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook