Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ..
Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. రిజల్ట్స్‌ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్ అనే భావనలో ఉంది.
Maharastra Jharkhand Election Results 2024: అయితే.. కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర ఎన్నికలే అత్యంత కీలకం అని చెప్పలి. ఈ ఎలక్షన్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో వారందరని బెంగళూరు లేదా హైదరాబాద్ లోని రిసార్ట్స్ కు తరలించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉంది.
ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలోనే కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేల క్యాంపులకు ప్రణాళికలు వేస్తోంది. రెండు రాష్ట్రాల్లో భారీగా రిసార్ట్స్, హెలికాప్టర్‌లను సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు మహారాష్ట్రలో గెలిచిన ఎమ్మెల్యేల బాధ్యత అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. ఎవరైతే గెలుస్తారో వారిని ఏయే ప్రాంతాలకు తరలించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు , కర్ణాటక ఉప ముఖ్యమంత్రితో ప్రణాళికలను రెడీ చేసింది.
ఫలితాల తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఓవైపు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే అధికారం కట్టబెట్టినప్పటికీ కాంగ్రెస్‌లో మాత్రం విశ్వాసం తగ్గడం లేదు. ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని భావిస్తోంది. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చనే దానిపై ఫలితాల వెల్లడైన వెంటనే ఈ క్యాంపు రాజకీయాలకు మొదలు పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో ఎన్ని చోట్ల గెలుపొందుతునేది చూడాలి. దాన్ని బట్టి ప్లాన్ ఏ, ప్లాన్ బీ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter