Malayala Manorama Cartoonist: కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్, మలయాళ మనోరమ కార్టూనిస్ట్ ఏసుదాసన్ ఇకలేరు. పోస్ట్ కరోనా సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించి..ఇవాళ తుది శ్వాస విడిచారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు సంతాపం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ (Kerala)రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సుపరిచితమైన ప్రముఖ కార్టూనిస్ట్ సీజే ఏసుదాసన్ ఇవాళ కన్నుమూశారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నా..పోస్ట్ కరోనా సంబంధిత సమస్యలు ఆయన్ను వెంటాడాయి. పోస్ట్ కరోనా సమస్యలతో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం మరింతగా క్షీణించి..ఇవాళ మృతి చెందారు. ఏసుదాసన్ మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan)సంతాపం తెలిపారు. కార్టూన్ల రంగం ప్రతిభావంతుడైన ఆర్టిస్టును కోల్పోయిందని నివాళులర్పించారు. ఏసుదాసన్ తన కార్టూన్ల ద్వారా ఓ సమయంలోని రాజకీయ పరిణామాల్ని ప్రతిబింబించేవారని..ధైర్యంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేసేవారన్నారు. ఏసుదాసన్ పనిని పరిశీలించినవారెవరైనా కేరళ రాజకీయ చరిత్రను గమనించవచ్చన్నారు. కేరళ ప్రతిపక్ష నేత వీడి సతీసన్ సంతాపం ప్రకటించారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఆయన చెరగని ముద్రవేశారన్నారు. ఏసుదాసన్ మృతిపై పలువురు సీనియర్ కార్డూనిస్టులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. కేరళ కార్టూన్ అకాడమీకి(Kerala Cartoon Academy) ఏసుదాసన్ తొలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఏసుదాసన్(Cartoonist Yesudasan)ఎంతో సౌమ్యమైన వ్యక్తి అని..ప్రతి ఒక్కరినీ గౌరవించేవారని ఢిల్లీకు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్‌నాథ్ తెలిపారు. రాజకీయ కార్డూన్లలో అందెవేసిన చేయిగా పరిగణించే ఏసుదాసన్‌కు చాలాసార్లు కేరళ ప్రభుత్వ ఉత్తమ కార్డూనిస్ట్ అవార్డులు దక్కాయి. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక అవార్డు, ఎన్ వి ఫైలీ వంటి అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. 83 ఏళ్ల ఏసుదాసన్ 1938లో అలప్పు జిల్లాలో జన్మించారు.


Also read: Lakhimpur Kheri: ఒక్క ఆధారం చూపించినా..మంత్రి పదవికి రాజీనామా చేస్తా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook