West Bengal Assembly Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్ల సగం ప్రక్రియ ముగిసింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితితులు తలెత్తుతున్నాయి. దీదీ, టీఎంసీ ఉగ్రవాగ వ్యూహాలు ఇకపై చెల్లవని ప్రదాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో(West Bengal Assembly Elections) నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో ఇప్పటికే సగం ఎన్నికలు ముగిశాయి. మరోవైపు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కూచ్ బెహార్, సీతాల్‌కుచిలో నియోజక వర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం కూచ్ బెహార్‌లో రెండు వేర్వేరు సంఘటనలలో ఐదుగురు మరణించారని తెలుస్తోంది. మరో నలుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) మమతా  బెనర్జీ  ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు చేశారు. ఓటరును కాల్చి చంపి ఘటన చాలా దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు.  పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ, టీఎంసీ(TMC) ఉగ్రవాద వ్యూహాలు బెంగాల్‌లో చెల్లవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి దీదీ ఆమె గూండాలకు వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు.


ప్రస్తుత ఎన్నికల్లో  మమతా బెనర్జీ(Mamata Banerjee)ని, ఆమె గూండా ముఠాను తిప్పి కొడతారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం, పోల్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం టీఎంసీని  కాపాడలేవంటూ దీదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూచ్ బెహార్‌ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. బెంగాల్‌లో కొత్త ఏడాదిలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ (BJP) సర్కార్‌ కొలువు దీరనుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో నూతన సంవత్సరం ప్రారంభం కానుందని.. మంచి చెడుపై విజయం సాధించబోతోందని అన్నారు. 


Also read: Delhi AIIMS: 35 మంది డాక్టర్లకు కొవిడ్-19


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook