Mamata Banerjee Oath: బెంగాల్ పీఠాన్ని ముచ్చటగా మూడవసారి కైవసం చేసుకున్న దీదీ..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో అత్యంత సాధారణంగా కొద్దిమందితోనే కార్యక్రమం ముగిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో( West Bengal Elections) మూడవ సారి టీఎంసీ విజయం సాధించింది. మమతా బెనర్జీ హ్యాట్రిక్ సాధించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలు సాధించగా..బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ( Mamata Banerjee takes oath as cm) అత్యంత సామాన్యంగా..ఏమాత్రం ఆర్భాటం లేకుండా సాగింది. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ మమతా బెనర్జీతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో అతికొద్దిమందితో కార్యక్రమం ముగిసింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


రాష్ట్రంలో హింస చెలరేగిపోతోందని..ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee) నియంత్రించాలని గవర్నర్ కోరారు. కొత్త ప్రభుత్వంలో శాంతి స్థాపించేలా చూడాలన్నారు. అయితే ఇప్పటివరకూ రాష్ట్రం ఎన్నికల సంఘం పరిధిలో ఉందని..రాష్ట్రంలోని పరిస్థితులకు ఎన్నికల సంఘం, గవర్నరే కారణమని మమతా బెనర్జీ నిర్మొహమాటంగా ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని..బెంగాల్ ప్రశాంతమవుతుందని చెప్పారు. ప్రమాణ స్వీకార వేదికపైనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. 


కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు నందిగ్రామ్‌( Nandigram)లో బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మూడు స్థానాల్లో ఎన్నికలు కూడా జరగాల్సి ఉండటంతో ఏదో ఓ స్థానాన్ని మమతా ఎంచుకోనున్నారు.


Also read: Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు నో చెప్పిన సుప్రీంకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook