Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు నో చెప్పిన సుప్రీంకోర్టు

Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠీయులకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2021, 12:59 PM IST
 Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు నో చెప్పిన సుప్రీంకోర్టు

Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠీయులకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం (Udhav Thackeray) మరాఠీయులకు 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా చట్టం చేసింది. దీనిపై బోంబే హైకోర్టులో విచారణ జరిగింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిసూ ఈ చట్టం రూపొందింది. బోంబే హైకోర్టు సైతం ఈ చట్టాన్ని సమర్ధించింది. అయితే 16 శాతం రిజర్వేషన్ సరైంది కాదని..ఉద్యోగాల్లో 12 శాతం, అడ్మిషన్లలో 13 శాతం మించకూడదని 2019లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలో బోంబే హైకోర్టు ( Bombay High Court) తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం..సంచలన తీర్పు ఇచ్చింది. 

రిజర్వేషన్లు చట్ట విరుద్ధమంటూ రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించితే సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరాఠీయులకు రిజర్వేషన్లు (Maratha Reservations) కల్పించేందుకు 50 శాతం ఉన్న పరిమితిని ఉల్లంఘించడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. 50 శాతం మించకూడదనే 1992 నాటి తీర్పును మరోసారి సమీక్షించలేమని కూడా కోర్టు అభిప్రాయపడింది. మరాఠా రిజర్వేషన్లను నిలిపివేసింది. 

Also read: India Corona Updates: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాల సంఖ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News