coronavirus: మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి
మనిషి ఆరోగ్యవంతంగా ఉండటానికి శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత కొరవడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో ప్రభుత్వం లాక్‌డౌన్ (Lockdown)ను విధించింది. ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండటం వల్ల విసుగుచెంది మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితికి చేరుకున్నారు.
Mental Health: న్యూఢిల్లీ: మనిషి ఆరోగ్యవంతంగా ఉండటానికి శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం (Mental Health) కూడా చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత కొరవడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో ప్రభుత్వం లాక్‌డౌన్ (Lockdown) ను విధించింది. ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండటం వల్ల విసుగుచెంది మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితికి చేరుకున్నారు. చాలా ప్రైవేట్ కంపెనీలు నిర్వహణ స్తంభించిపోయింది. చాలామంది ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు సైతం పనిలేక ఇంట్లోనే ఉంటున్నారు. దీనివల్ల చాలామందికి ఇప్పుడేం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. పైగా కుటుంబ సమస్యలు, కరోనా వైరస్ వ్యాప్తి కూడా ప్రజల మానసిక పరిస్థితిపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఇలా మొత్తానికి కరోనా లాక్‌డౌన్ ప్రజల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) ప్రజలకు సూచించింది. ఈమేరకు మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని సలహాలు సూచనలు చేస్తూ మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. Also read: World Chocolate Day: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో
‘‘మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి మానసిక సామాజిక సహాయం కావాలన్నా.. దీనికోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరాలజీ (NIMHANS) హెల్ప్‌లైన్ నెంబర్ # 080-46110007 కు కాల్ చేయండి. మీ ప్రవర్తనను మార్చుకోండి.. కరోనాపై పోరాడండి’’ అంటూ ట్వీట్ చేసింది.
మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సూచనలు..
మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటానికి ధూమపానం, మద్యం లేదా ఇతర మాదక ద్రవ్యాలకు మీరు బానిసలుగా మారవద్దు. అలాంటివాటికి దూరంగా ఉండండి.
చురుకుగా, ఆనందంగా ఉండటానికి యోగా, ధ్యానం వ్యాయామం వంటివి చేయాలి.
ఖాళీ సమయాల్లో మీకు ఇష్టమైన పనిని చేయాలి. అది ఆటలాడటం, వంటలు చేయడం, పుస్తకాలు చదవడం, రాయడం, ఇంటిపని, కుటుంబ సభ్యులతో గడపటం లాంటివి చేయాలి.
మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే మనం భవిష్యత్తులో మంచి పనులు, ఉద్యోగాలు చేయగలం అనే అనుకూల భావనలను అలవర్చుకోవాలి.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు. Also read: Sleeping Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి
హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..