Ayodhya New Mosque: అయోధ్య మసీదుపై ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు, కారణమేంటి
Ayodhya New Mosque: అయోధ్యలో ఓ వైపు రామమందిరం..మరోవైపు మసీదు నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. భారీగా విరాళాల సేకరణ నడుస్తోంది. అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
Ayodhya New Mosque: అయోధ్యలో ఓ వైపు రామమందిరం..మరోవైపు మసీదు నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. భారీగా విరాళాల సేకరణ నడుస్తోంది. అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
అయోధ్య ( Ayodhya ) లోని వివాదాస్పద రామ జన్మభూమి ( Ram janmabhumi ) వివాదంలో సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు అనంతరం రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. రామ మందిర ( Ram mandir ) నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభమైంది. అదే సమయంలో తాజాగా ఐదెకరాల స్థలంలో మసీదు ( Ayodhya Mosque ) నిర్మాణానికి రిపబ్లిక్ డే నాడు శంకుస్థాపన జరిగింది. మసీదు నిర్మాణం కోసం కూడా విరాళాల సేకరణ ప్రారంభమైంది. ఇప్పుడీ విషయంపైనే అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవినీతి సొమ్ముతో మసీదు కట్టడం హరామ్ అని వ్యాఖ్యానించారు. ఆ మసీదుకు విరాళాలివ్వవద్దని..ఎవరూ అక్కడ నమాజ్ కూడా చదవకూడదని అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) స్పష్టం చేశారు. అయోధ్య మసీదు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని చెప్పారు. బాబ్రీ మసీదు ( Babri masjid ) కూల్చిన చోట మసీదు నిర్మించడం అనైతికమని తెలిపారు. చాలా మంది మతపెద్దల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉలేమా కూడా మసీదుగా పిలవవద్దని..నమాజ్ చేయవద్దని చెప్పినట్టు ఒవైసీ స్పష్టం చేశారు.
Also read: Farmers vs Up Police: ఉరి వేసుకుంటాం గానీ..ఖాళీ చేయం, రైతు ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook